మమితా బైజు అసభ్యకర AI వీడియో.. సోషల్ మీడియాలో వైరల్.!
Nov 24, 2026 3:04PM

సినిమాల్లో నటీనటుల మధ్య కెమిస్ట్రీని చూసి అభిమానులు మురిసిపోతుంటారు. కానీ అదే సినిమా సన్నివేశాలను కొందరు దుర్వినియోగం చేస్తే? ఇప్పుడు అలాంటి ఘటనే మలయాళ నటి మమితా బైజు, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ విషయంలో చర్చకు వచ్చింది.
వీరిద్దరూ కలిసి నటించిన డ్యూడ్ సినిమా ఫుటేజ్‌ను ఉపయోగించి అసభ్యకరమైన AI వీడియో రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2025లో విడుదలైన తమిళ చిత్రం 'డ్యూడ్'లో మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్ జంటగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అదే సినిమాలోని కొన్ని సీన్స్ ఆధారంగా చేసుకుని, AI సాయంతో అసభ్యకరమైన వీడియోను సృష్టించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నటీనటుల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా టెక్నాలజీని ఉపయోగించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వీడియోలను డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం కాకుండా సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు రిపోర్ట్ చేయాలని పలువురు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: వారణాసి వీడియో లీక్.. ఆపిల్ చేసిన పనికి షాక్‌లో రాజమౌళి.!
AI టెక్నాలజీతో నిజంగా జరిగినట్టుగా కనిపించే ఫేక్ వీడియోలను సృష్టించడం ఇప్పుడు చాలా సులభమవుతోంది. అయితే ఈ సాంకేతికతను సృజనాత్మక పనుల కోసం ఉపయోగించాల్సింది పోయి, ఇతరుల ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా మార్చి అసభ్యకరమైన కంటెంట్ తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ పలువురు సినీ ప్రముఖులు ఇలాంటి డీప్‌ఫేక్‌ల బారిన పడిన సందర్భాలున్నాయి.
మీకు నచ్చవచ్చు:
శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.!
విజయ్ స్థానంలో త్రిష.. TVKలో అసలు ఏం జరుగుతోంది.?
[Mamitha Baiju, Pradeep Ranganathan, Dude Movie, Viral AI Video, Deepfake]



