Home

»

Latest News

మహేశ్, సుకుమార్ సెకండ్ మూవీ: అసలు నిజం ఏంటి?.. 'RC17' ప్రాజెక్ట్ ఏమైంది.?

Oct 10, 2026 12:20PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే ఆసక్తికరమైన చర్చ. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. ఆ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఈ కాంబో మళ్లీ రిపీట్ కావాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

తాజాగా ‘వారణాసి’ తర్వాత మహేశ్ బాబు చేయబోయే సినిమా సుకుమార్ దర్శకత్వంలోనే ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. అయితే ఇక్కడే ఓ ప్రశ్న ఎదురవుతోంది. నిజంగానే మహేశ్, సుకుమార్ కలిసి సినిమా చేయాలనుకుంటే.. అది ఎప్పుడు సాధ్యమవుతుంది?

ప్రస్తుతం సుకుమార్ తన తదుపరి సినిమా కోసం రామ్ చరణ్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.

ఈ సినిమా పూర్తయ్యాకే సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలరు. అందువల్ల మహేశ్‌తో సినిమా చేయాలనే ఆలోచన ఉన్నా.. వెంటనే పట్టాలెక్కడం మాత్రం కష్టమేనని చెప్పొచ్చు.

మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 7, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేశ్ ఎవరితో పనిచేస్తారనే విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.

సందీప్ రెడ్డి వంగా, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకుల పేర్లు మహేశ్ తదుపరి సినిమా విషయంలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీటిలో ఏ ప్రాజెక్ట్ ఖరారైందనే దానిపై స్పష్టత లేదు. లోకేష్ ప్రాజెక్ట్ లాక్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ఈ లెక్కలన్నీ చూస్తే.. మహేశ్ బాబు, సుకుమార్ రెండో సినిమా ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే.. ఇద్దరూ తమ ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

గతంలో ‘1 నేనొక్కడినే’తో ప్రయోగాత్మక కథను అందించిన ఈ ఇద్దరూ.. మరోసారి కలిస్తే ఎలాంటి కథను ఎంచుకుంటారనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. 

ఇది కూడా చదవండి: క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులో హీరోయిన్‌గా కేథరిన్.!

 

 

 

[Mahesh Babu Sukumar Reunion, Mahesh Babu Sukumar Second Movie, Mahesh Babu Next Movie, Ram Charan Sukumar Movie, RC17 Movie, Varanasi Movie, 1 Nenokkadine Movie, Mahesh Babu, Director Sukumar, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com