
వారణాసి లో మహేష్ శ్రీరాముడిగా చేస్తున్న విషయం తెలిసిందే
సోషల్ మీడియాలో సదరు శ్రీరాముడు పిక్ వైరల్
వేదికగా నిలిచిన గుంటూరు
మహేష్ బాబు(Mahesh Babu),రాజమౌళి(Ss Rajamouli)పుణ్యమా అని 'వారణాసి'(Varanasi)వరల్డ్ సినిమాగా రూపాంతరం చెందింది. మేకర్స్ కూడా అందుకు తగ్గట్టే ప్రపంచ స్థాయి ప్రమాణాలకి అనుగుణంగా అత్యున్నత సాంకేతికత ప్రమాణాలతో 'వారణాసి' ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ క్యారక్టరయిజేషన్ ఎవరి ఊహకి అందని విధంగా ఉండబోతుంది. ఇందుకు నిదర్శనంగా మెడలో రుద్రాక్షని ధరించే శివభక్తుడైన 'రుద్ర' తో పాటు శ్రీరాముడిగాను కనిపించబోతున్నాడు.ఆ రెండు అంశాలు చాలు. మహేష్ క్యారక్టర్ ఎవరి ఊహలకి అందని విధంగా ఉండబోతుందని చెప్పడానికి. దీంతో అభిమానులు శ్రీరాముడిగా మహేష్ ఎలా ఉంటాడో అనే ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో శ్రీరాముడిగా మహేష్ గెటప్ వైరల్ అవుతుంది.ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
గుంటూరులోని మైత్రీ సినిమాస్(Mythri Movie Makers)కి సంబంధించిన ఒక థియేటర్ లో 'వారణాసి' లో మహేష్ బాబు రాముడి గెటప్ లో ఉన్న డిజిటల్ పోస్టర్‌ని ఏర్పాటు చేశారు.ధనుస్సు ధరించి ఉన్న ఆ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రాజమౌళి అధికారకంగా శ్రీరాముడిగా మహేష్ లుక్ ని రివీల్ చేయలేదు.ఒక వేళ లీక్ అయిందేమో అని అనుకున్నా మైత్రి వారు సుదీర్ఘ కాలం నుంచి అగ్ర నిర్మాతలుగా ఉన్నారు. దీంతో లీక్ లని వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరగని పని. కాబట్టి ఊహించి ఏర్పాటు చేసిన గెటప్ అనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి. అభిమానులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా యుగం కాబట్టి రాజమౌళి, మహేష్ వద్దకు సదరు పిక్ న్యూస్ ఎవరి రికమండేషన్ లేకుండానే వెళ్లడం ఖాయం. ఆ ఇద్దరు స్పందించడం ఖాయం.
also read: Biker: బిజినెస్ డీల్ ఇదేనా! మరి శర్వానంద్ నెక్స్ట్ సినిమాల పరిస్థితి ఏంటి
ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ తో పాటు వరల్డ్ మేటి నటులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న వారణాసి 2027 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. విజయేంద్ర ప్రసాద్(vijayendra Prasad)కథ ని అందించగా కీరవాణి సంగీత దర్శకుడు అనే విషయం తెలిసిందే.






.webp)
