చిన్నారి ఇన్ స్టా రీల్‌కి మహేష్ బాబు ఫిదా.. 27 మిలియన్ల వ్యూస్: చిన్నారి ఎవరో తెలుసా!
Nov 25, 2026 9:17AM

సూపర్ స్టార్ మహేష్ బాబు.. సింప్లీసిటీకి మారుపేరు. తన పని తాను చేసుకుంటూ ఉండటంతో పాటు తన నట జీవితంలో అతి చెయ్యని ఏకైన హీరోగా కూడా అభిమానులు భావిస్తుంటారు. అలాంటి మహేష్ ఒక చిన్నారి ఇనిస్టా రీల్ కి ఫిదా అయ్యి మెచ్చుకుంటే ఇంకేమైనా ఉందా? ఆ చిన్నారి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించినట్టే లెక్క. 27 మిలియన్ల వ్యూస్ ఉంది అక్కడ మరి!..పూర్తి మ్యాటర్ చూద్దాం.
ఇటీవల ‘bysweetlycurious’ అనే ఓ ఇన్ స్టా గ్రామ్ రీల్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. అందులో ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి క్యూట్ గా పాటలు పాడుతూ కనిపించింది. మొదట పోకిరి సినిమాలోని ‘నొప్పి నొప్పి గుండెంత నొప్పి’ పాటని పాడిన చిన్నారి ఆ తర్వాత తల్లితో కలిసి గుంటూరు కారం సినిమాలోని 'ధూమ్ మసాలా' పాటని పాడింది.
ఇందులో చిన్నారి స్వీట్ వాయిస్ తో పాటు ఆ పాప ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని ఎలాంటి రికమండేషన్ లేకుండానే షేక్ చేస్తోంది. దీంతో మహేష్ బరిలోకి దిగాల్సిన పరిస్థితి.
.webp)
వెంటనే తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ‘హా హా.. సో క్యూట్.. లాట్స్ఆఫ్ లవ్ టు ది లిటిల్ వన్’ అని కామెంట్ చేశారు. అంతే ఆ రీల్ ఏకంగా 27 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్లిపోయింది. అంతే కాదు ఆ అకౌంట్ ఫాలోవర్స్ సైతం అమాంతం పెరిగిపోయారు. ఈ రీల్ కు ముందు 35K ఫాలోవర్స్ ఉండగా ఇప్పుడు ఏకంగా 151 K కి చేరారు. మొత్తానికి మహేష్ బాబు కామెంట్ తో ఈ చిన్నారి వీడియో ఇప్పడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: శర్వానంద్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నాడా: నిన్న రాత్రి ఏం జరిగిందో తెలిసిపోయింది!
మహేష్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసితో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సారి బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కి బ్యాండే అనే రీతిలో ఇండియన్ సెల్యులాయిడ్ ని షేక్ చేయబోతున్నాడు.

మీకు నచ్చవచ్చు
[Mahesh Babu, instagram, varanasi, SS rajamouli, tollywood]



