మహేష్ బాబుకి దెబ్బ మీద దెబ్బ.. దీనికి వెనుక ఉన్నపెద్దలు వాళ్లే
on Jul 7, 2025
సూపర్ స్టార్ 'మహేష్ బాబు'(Mahesh Babu)గత కొంత కాలంగా సాయి సూర్య డెవలపర్స్(Sai Surya Devolopers)అనే రియల్ ఎస్టేట్ సంస్థకి ప్రచారకర్తగా ఉన్నాడు. సదరు సంస్థ 'తెలంగాణ'(Telangana)లోని రంగారెడ్డి జిల్లా పరిధిలో కొన్ని వెంచర్స్ వెయ్యగా చాలా మంది కొన్ని ప్లాట్ లని కొనుగోలు చెయ్యడం జరిగింది. కానీ ఆ తర్వాత సాయిసూర్య డెవలపర్స్ డబ్బు చెల్లించిన వాళ్ళకి ఫ్లాట్ లని కేటాయించకుండా మోసం చేసింది.
దీంతో మోసపోయిన బాధితులు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరమ్ ని సంప్రదించి మహేశ్ బాబు ఫొటోతో ఉన్న బ్రోచర్లో ఉన్న వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్టుగా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ మహేశ్ కి నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ ని మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త మహేశ్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చడం జరిగింది. సాయిసూర్య డెవలపర్స్ కేసుతో పాటు సురానా ప్రాజెక్ట్ అనే మరో కేసులో ఇప్పటికే మహేష్ బాబుకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నోటీసులు జారీ చేసింది. ప్రత్యేకించి మహేష్ కి సాయి సూర్య డెవలపర్స్ ఐదు కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ ఇచ్చినట్టుగా ఈడి అధికారులు గుర్తించారు.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి(SS Rajamouli)దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే మరో షెడ్యూల్ ని జరుపుకోనుంది. ప్రియాంక చోప్రా(Priyanka Chopra)హీరోయిన్ కాగా పలువురు విదేశీ నటులు కూడా చేయబోతున్నారనే వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
