TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

దెయ్యంతో ప్రేమ.. 'లవ్ మీ' విడుదలకు ముహూర్తం ఖరారు

Mar 24, 2024 5:00PM

ఆశిష్(Ashish), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు(Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తోన్న చిత్రం 'లవ్ మీ' (Love Me). ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకుడు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. టీజర్‌ను గమనిస్తే కట్టిపడేసే కథనంతో పాటు వెన్నులో భయాన్ని కలిగించే హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది.

'బలగం' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రమిది. ఓ కుర్రాడు, దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది.. ఏమవుతుంది.. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఈ హారర్ థ్రిల్లర్‌ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.

ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. సంతోష్ కామిరెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

google-ad-img