TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

లీకైన బాహుబలి స్టోరీ

May 21, 2014 10:01AM

Leaked Baahubali Story, Prabhas Baahubali Story Leaked, Baahubali Full Story Leak, Rajamouli Bahubali Full Story Leaked, Leaked Story of Bahubali

 

భారీ అంచనాలతో, భారీ తారాలతో, భారీగా తెరకెక్కుతున్న బాహుబలి చిత్రం ఆడియో కూడా విడుదల కాకముందే ఎంతో హైప్ తెచ్చుకుంది. ఆరడుగుల అందగాళ్లు రానా, ప్రభాస్ రాజుల గెటప్స్‌తో కనిపిస్తున్న ఈ చిత్రకథ ఎలా ఉండబోతుందో అనే విషయం పై  ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని వుంది. అనుష్క, తమన్నా ఇందులో కథానాయికలుగా ప్రముఖపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అడవి శేషు, సుదీప్ వంటి నటులు కూడా వున్నారు. ఈ చిత్రం కోసం, ఈ చిత్రంలో తమ పాత్రల కోసం అందరూ కష్టపడిన వారే.


మరి ఇంత ఎక్సైటింగ్ మూవీ ఎలా వుండబోతుందనే కుతూహలం అందరిలో వుంది. చాలా కాలంగా షూటింగ్ నిర్వహిస్తున్న ఈ యూనిట్ ఈ మధ్యే బ్రేక్ తీసుకుంది. ఈ సమయంలో సినిమా గురించిన కొన్ని విషయలు లీక్ అయినట్లు వార్తలు ప్రచురితం అయ్యాయి. వాటి ప్రకారం ఈ సినిమా సెకండ్ పార్ట్‌లో అనుష్క గర్భవతిగా కనిపించనుందట. రానా క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ తర్వాత కనపడదట. ఇక ప్రభాస్ కూడా ఫస్ట్ పార్ట్‌లో చనిపోయి, సెకండ్ హాఫ్‌లో అనుష్కకు కొడుకుగా పుడతాడట. ఆ ప్రభాస్ క్యారెక్టర్‌కి తమన్నా హీరోయిన్. అలాగే ఇందులో రానా కొడుకుగా అడవి శేషు నటిస్తున్నాడని, అతను ప్రభాస్‌‌తో యుద్ధం చేస్తాడట. గతంలో వచ్చిన కథనాల ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్నారని, ఇద్దరి మధ్య పగతో కూడుకున్న వాతావరణం ఉంటుదని తెలిసిందే. ఈ వివరాలను బట్టి సినిమా కథ మరింత వివరంగా ఎవరికి వారే ఊహించుకోగలరు. ఇక రాజమౌళి రెండు జన్మలు, డబుల్ యాక్షన్ ఫార్ములాని ఇందులో కూడా వాడబోతున్నారని అనిపించకమానదు.


ఈ చిత్రం గురించిన విషయాలేవి బయటకు రాకుండా ఈ చిత్ర బృందం చాలా జాగ్రత్త పడుతూ వస్తోంది. కాబట్టి లీకైన సమాచారం వాస్తవం కాకపోయినా ఆశ్చర్యం లేదు.

google-ad-img