Home

»

Latest News

మంచు లక్ష్మీకి జ్ఞానోదయం

Apr 24, 2014

 

ఎప్పుడూ, ఏం మాట్లాడినా కూడా "డాడీ" అనే పదం రాకుండా మాట్లాడని లక్ష్మీ ప్రసన్న తాజాగా తన తండ్రిపై ఇక ఆధారపడకూడదని నిర్ణయం తీసుకుంది. అసలు విషయం ఏమిటంటే... "ఇప్పటివరకు నేను చేసినవాటిలో కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకోలేదు. ఇకనుంచి అలా చేయదల్చుకోలేదు. మా నాన్నగారు ధనవంతులే. కానీ, నేను కాదు. ఇంకా ఆయన మీద ఆధారపడితే ఏం బాగుంటుంది? నాకూ కుటుంబం ఉంది కదా. అందుకే, మంచి పాత్ర, అందుకు తగ్గ పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను చేస్తాను" అని లక్ష్మీ స్పష్టం చేసింది.

అసలు లక్ష్మీ ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇంత సడెన్ గా లక్ష్మీకి తన కుటుంబం ఎందుకు గుర్తుకు వచ్చింది? అంటే ఇన్ని రోజులు మెట్టినిల్లు గురించి మర్చిపోయిందా? ఏమో ఎవరికీ తెలుసు.

లక్ష్మీ నటించిన "చందమామ కథలు" విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై లక్ష్మీ చాలా నమ్మకంతో ఉంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com