డివైడ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ దిశగా 'కృష్ణ వ్రింద విహారి'!
on Sep 26, 2022
ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం 'కృష్ణ వ్రింద విహారి' చిత్రానికి కలిసొచ్చింది. మొదటి షో నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. మొదటి మూడు రోజులు టాక్ తో సంబంధం లేకుండా రోజురోజుకి కలెక్షన్లు పెంచుకుంటూ సత్తా చాటింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.5.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ మొదటి రోజు 95 లక్షల షేర్ రాబట్టగా, రెండో రోజు 1.19 కోట్ల షేర్, మూడో రోజు 1.26 కోట్ల షేర్ తో సత్తా చాటింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.3.40 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.2 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 70 లక్షల షేర్, రెండో రోజు 92 లక్షల షేర్, మూడో రోజు 1.13 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 2.75 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటిదాకా కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 13 లక్షల షేర్, ఓవర్సీస్ లో 52 లక్షల షేర్ కలెక్ట్ చేసింది.
ఈరోజు(సోమవారం) నుంచి 'కృష్ణ వ్రింద విహారి'కి అసలు పరీక్ష ఎదురు కానుంది. దసరా సందర్భంగా ఈ నెల 30 నుంచి పెద్ద సినిమాల తాకిడి మొదలు కానుంది. ఆలోపే 'కృష్ణ వ్రింద విహారి' బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. మరి మొదటి వీకెండ్ అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఫుల్ రన్ లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Also Read