చచ్చేలోపు తప్పక తీస్తాను
Feb 11, 2014 10:43AM

కృష్ణవంశీ దర్శకత్వంలో నాని, కేథరిన్ జంటగా నటించిన తాజా చిత్రం "పైసా". ఇటీవలే విడుదలై విమర్శల ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ సందర్భంగా దర్శకుడు తన ఆనందాన్ని పంచుకుంటూ..."సాధారణంగా నేను థియేటర్లలో సినిమా చూడను. కానీ, ఈ సినిమా చూశాను. ప్రేక్షకులు ప్రతి సన్నివేశం కూడా చాలా ఎంజాయ్ చేయడం చాలా నచ్చింది. ఈరోజున తెలుగు సినిమా హీరో అంటే పోకిరి, దొంగ, పోరంబోకు, ఎందుకూ పనికిరానివాడుల ఉంటున్నాడు. శేఖర్ కమ్ముల, క్రిష్ లాంటి దర్శకుల చిత్రాల్లో మాత్రమే కాస్త బాధ్యతాయుతంగా కనిపిస్తాడు. మిగిలిన సినిమాల్లో హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమ బుద్ధుడే. అదే విధంగా ప్రేమ పట్ల నాకున్న అభిప్రాయం వేరు. నేటి సినిమాల్లో చూపిస్తున్న ప్రేమ వేరు. అందుకే ప్రేమకథా చిత్రాలకు కామా పెట్టా. త్వరలోనే నా నుండి ఓ ప్రేమకథా వస్తుంది. అదే విధంగా నా డ్రీం ప్రాజెక్ట్ "వందేమాతరం " సినిమా నేను చనిపోయేలోపు తప్పకుండా తీస్తాను. ఎందుకంటే నేటి సమాజానికి ఆ సినిమా అవసరం.




