Home

»

Latest News

కామ్రేడ్ కళ్యాణ్: చిరంజీవి వల్లే సినిమా రిలీజ్.. అసలు విషయం బయటపెట్టిన కోన వెంకట్.!

Oct 14, 2026 4:40PM

శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించగా, కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అక్టోబర్ 9న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ, కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. అయితే విడుదలకు ముందు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సెన్సార్ చిక్కుల్లో పడింది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి, సినిమా సాఫీగా విడుదలయ్యేలా చూశారు. ఈ విషయాన్ని స్వయంగా కోన వెంకట్ తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకోవడం విశేషం.

కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ కారణంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ నిరాకరించి, విడుదలకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రొడ్యూసర్లతో సహా తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని కోన వెంకట్ తెలిపారు. షూటింగ్ సమయంలో తాను డల్ గా ఉండటం చూసి చిరంజీవి గారు విషయం అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆయన రెండు ఫోన్లు చేసి మాట్లాడటంతో ఆ సమస్య త్వరితగతిన పరిష్కారమై సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని, ఆయన తమకు 'ఆపద్బాంధవుడు'గా నిలిచారని పేర్కొన్నారు.

చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'కాకా' సినిమాకు కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర చాలా గ్రౌండెడ్ గా, కొత్తగా ఉంటుందని, తండ్రి-కూతురు ఎమోషన్ ప్రధానంగా సాగుతుందని చెప్పారు. ఇందులో డ్యూయెట్లు గానీ, హీరోయిన్ ట్రాక్ గానీ ఉండవని, కదిరి కాళిదాస్/సత్యనారాయణ అనే లేయర్స్ ఉన్న పాత్రలో చిరంజీవి కనిపిస్తారని వెల్లడించారు.

158కి పైగా సినిమాలు చేసినప్పటికీ, ఇప్పటి యంగ్ హీరోల కంటే చిరంజీవి గారు చాలా వేగంగా, పట్టుదలతో సినిమాలు పూర్తి చేస్తున్నారని కోన ప్రశంసించారు. అంతేకాకుండా, ప్రొడక్షన్ ఖర్చులు పెరగకుండా సెట్‌లో బడ్జెట్ నియంత్రణపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని, ప్రొడ్యూసర్ క్షేమం కోరే ఈ స్పృహ ప్రతి హీరోకి ఉండాలని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్.. నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.!

 

 

 

[Kona Venkat Interview, Kona Venkat About Chiranjeevi, Comrade Kalyan Movie, Kona Venkat, Megastar Chiranjeevi, Kaaka Movie, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com