
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. రీసెంట్ గా కేటీఆర్ ‘ది అండర్ 18 వరల్డ్’ (The Under 18 World) అనే యూత్ టాక్ షోలో పాల్గొన్నప్పుడు ఈ క్రేజీ అండ్ క్యూట్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.
షో సరదాగా సాగుతున్న సమయంలో, అక్కడున్న చిన్నారులు కేటీఆర్‌కు ఒక క్రేజీ ఛాలెంజ్ విసిరారు. "సార్.. మీ ఫోన్ నుంచి సూపర్ స్టార్ కు కాల్ చేయాలి" అని అడిగారు. దానికి కేటీఆర్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా, ముసిముసి నవ్వులు రువ్వుతూ వెంటనే తన పర్సనల్ ఫోన్ తీసి డార్లింగ్ ప్రభాస్‌కు డైరెక్ట్ కాల్ చేశారు.

కట్ చేస్తే.. అక్కడ కాల్ కనెక్ట్ అయింది. అవతలి వైపు నుంచి ప్రభాస్ "గుడ్ ఈవెనింగ్ సార్" అంటూ తన మార్క్ స్వీట్ వాయిస్‌తో ఆన్సర్ చేశారు. ఇక వెంటనే సీన్‌లోకి ఎంటర్ అయిన ఆ చిన్నారులు, కేటీఆర్ ఫోన్ తమ చేతికి తీసుకోని ఒక ఫన్నీ కథ అల్లేశారు. "రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఫోన్ దొరికింది. చూస్తే ఇందులో మీ నెంబర్ ఉంది. ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకోవచ్చా" అంటూ ప్రాంక్ చేశారు. దాంతో ప్రభాస్ కి ఏం అర్థంగాక కాల్ కట్ చేశారు.
ఆ తర్వాత కేటీఆర్ ఫోన్ తీసుకొని, మళ్ళీ ప్రభాస్ కి కాల్ చేసి.. అసలు విషయం చెప్పారు. ఇప్పుడు ఈ క్యూట్ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి నవ్వులు పూయిస్తోంది.
Under 18 World Show, KTR Prabhas Prank Call, KTR Phone Call Prabhas, KTR Prabhas Viral Video, KTR, Prabhas, Telugu Film News, Telugu News






