Home

»

Latest News

ఒక కూతురు నిర్మాత, మరో కూతురు హీరోయిన్.. ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోయిన్ ఫ్యామిలీ   

May 29, 2026 12:29PM


సౌత్ సినీ పరిశ్రమలో  ఖుష్బూ(khushbu)సంపాదించుకున్న స్టార్ డమ్ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. సింపుల్ గా చెప్పాలంటే తమిళనాట  ఖుష్బూకి గుడి కూడా కట్టారు. దీన్ని బట్టి ఆమె కెపాసిటీని అర్ధం చేసుకోవచ్చు. తెలుగు నాట ప్రస్తుతం పలు షోస్ కి హాజరవుతు అభిమానులని అలరిస్తూ వస్తుంది.  ఖుష్బూ  ప్రముఖ దర్శకుడు సుందర్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఇప్పుడు ఆ ఇద్దరి వారసురాలు ఆనందిత నటిగా కాకుండా, ప్రొడ్యూసర్‌గా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఖుష్బూకే చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'అవ్నీ మూవీస్', బెంజ్ మీడియాతో కలిసి నిర్మించిన  'డబుల్ ఆక్యుపెన్సీ'  ద్వారా ఆనందిత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికి అశ్విన్ కందసామి దర్శకుడిగా పరిచయం కాగా, సంతోష్, సంయుక్త విశ్వనాథ్ హీరో హీరోయిన్లు. కాగా, ఈ చిత్రానికి ఆనందిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  గా వ్యవహరించడం విశేషం. రీసెంట్ గా  చెన్నైలో ఆడియో లాంచ్ వేడుకని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఖుష్బూ తన కుమార్తె ఆనందిత సినీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక తల్లిగా తన కూతురు ఇంత పెద్ద బాధ్యతను భుజాన వేసుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది.ఆనందిత, హీరో సంతోష్ స్కూల్ రోజుల నుంచే మంచి స్నేహితులు. అయితే మొదట్లో వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి అసలు పడేది కాదు. నిరంతరం గొడవ పడేవారు. అలాంటి ఇద్దరు స్నేహితులు ఒకరోజు ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకుని నేరుగా నా వద్దకు తీసుకువచ్చినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను.


Also read: Peddi:పెద్ది, మోదీకి మధ్య ఉన్న లింక్ ఇదే.. ఇంతకీ మహమ్మద్ ఎవరనుకుంటున్నారు 


నేటి తరం యువత ఆలోచనలు, వారి జీవనశైలి ఎలా ఉంటుందనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సాధారణంగా పెద్దవాళ్లే యువతకి  హితబోధ చేస్తారు, కానీ ఈ మూవీలో  యువత నుంచే పెద్దవాళ్లు ఏం నేర్చుకోవాలనే సరికొత్త కోణాన్ని చూపించబోతున్నారు.   ఈ తరం పిల్లలకి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. ఖుష్బూ మరో కుమార్తె అవంతిక కూడా త్వరలోనే మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఒక కుమార్తె హీరోయిన్‌గా, మరో కుమార్తె ప్రొడ్యూసర్‌గా సినిమా రంగంలో రాణిస్తుండటంతో ఖుష్బూ ఫ్యామిలీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com