
లింగ బేధంతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి ఎవరి ఒకరిపై 'క్రష్ ' అనేది ఉంటుంది. అది తప్పు కూడా ఏం కాదు.ఈ కోవలోనే అందాల భామ అనుపమ పరమేశ్వరన్ పై క్రష్ ఉండే దని ప్రముఖ గేయ రచయిత చెప్పడం ఆటోమేటిక్ గా వైరల్ హోదాలో దూసుకుపోతూ ఉంది.
అనుపమ పరమేశ్వరన్ గురించి కాసర్ల శ్యామ్ మాట్లాడుతు 'అనుపమ అంటే నాకు క్రష్ అని, ఆమెని మొదటిసారి చూసినప్పుడే మనసు పారేసుకున్నానని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆమెపై తనకున్న అభిమానాన్ని వివరిస్తూ తాను అనుపమని 'అఆ' అని పిలుస్తానని చెప్పారు. ఇందులో 'అ' అంటే అనుపమ అని, 'ఆ' అంటే ఆరాధన అని ఆయన ఎంతో సృజనాత్మకంగా వివరించారు. అనుపమను తాను అంతలా ఆరాధిస్తానని, ఆమెకు పెద్ద అభిమానిని అయిపోయానని కాసర్ల శ్యామ్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ వ్యాఖ్యలు వైరల్: నటి కోసం భార్యని కోమాలోకి వెళ్లేలా కొట్టాడు!

అనుపమ పరమేశ్వరన్ కీ రోల్ పోషించిన తాజా చిత్రం 'క్రేజీ కల్యాణం'. బద్రప్ప గాజుల దర్శకుడు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ లోనే కాసర్ల శ్యామ్ క్రష్ వ్యాఖ్యలు చేసాడు.
[kasarla shyam Interesting Comments On Anupama Parameswaran, Kasarla shyam crush on anupama parameswaran, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





