'కార్తికేయ-2' సంచలనం.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
on Aug 16, 2022
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ లిస్టులో 'కార్తికేయ-2' చేరేలా ఉంది. ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీ రోజురోజుకి స్క్రీన్స్, కలెక్షన్స్ పెంచుకుంటూ మూడు రోజుల్లోనే బ్రేక్ సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'కార్తికేయ-2'.. మొదటి రోజు రూ.3.50 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.81 కోట్ల షేర్, మూడో రోజు రూ.4.23 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లోనే రూ.11.54 కోట్ల షేర్(17.80 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. మూడు రోజుల్లో నైజాంలో రూ.4.06 కోట్ల షేర్(బిజినెస్ 3.50 కోట్లు), సీడెడ్ లో రూ.1.83 కోట్ల షేర్(బిజినెస్ 1.80 కోట్లు), ఆంధ్రాలో రూ.5.65 కోట్ల షేర్(బిజినెస్ 6 కోట్లు) వసూలు చేసింది.
నార్త్ ఇండియాలో 0.60 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 0.70 కోట్ల షేర్, ఓవర్సీస్ 2.60 కోట్ల షేర్ కలిపి.. వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో 15.44 కోట్ల షేర్(26.50 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టడం విశేషం.
ఫుల్ రన్ లో 'కార్తికేయ-2' దాదాపు రూ.30 కోట్ల షేర్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా అద్భుతాలు చేసే అవకాశముందని అంటున్నారు. హిందీ మార్కెట్ లో స్లో పాయిజన్ లాగా రోజురోజుకి స్క్రీన్స్, కలెక్షన్స్ పెంచుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో అక్కడ మంచి నంబర్స్ నమోదు చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read