
బాక్సాఫీస్ దగ్గర మళ్లీ డబుల్ ధమాకా క్రియేట్ చేయడానికి తమిళ హీరో కార్తీ 'సర్దార్ 2' తో వచ్చేస్తున్నారు. 2022లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన 'సర్దార్' సినిమాకి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతున్న ఈ మూవీ సెన్సార్ పనులను ఇటీవల పూర్తి చేసుకుంది.
ఈ సినిమాకి సెన్సార్ బోర్డు UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా మొత్తం రన్ టైమ్ 2 గంటల 59 నిమిషాలు (179 నిమిషాలు). నిడివి కాస్త భారీగానే అనిపించినా, ప్రతీ నిమిషం ఊపిరిసలపని హై యాక్షన్ సీన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని సెన్సార్ టాక్ వెల్లడిస్తోంది.

కథ ఏంటంటే.. భారత ప్రధాని అత్యవసరంగా ఒక సీక్రెట్ మిషన్‌ను ఆదేశిస్తారు. దేశ భద్రతను దెబ్బతీయడానికి 'బ్లాక్ డాగర్' అనే డేంజరస్ పాత్రలో ఎస్‌జే సూర్య ఒక ముఠాతో కలిసి భారీ కుట్ర పన్నుతాడు. ఈ కుట్రను భగ్నం చేయడానికి జపాన్ భాష తెలిసిన ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ అవసరమవుతాడు. దాంతో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్, సీక్రెట్ ఏజెంట్ విజయ్ (కార్తీ) రంగంలోకి దిగుతాడు. ఒకపక్క నేటి సమాజంలో తీవ్రమైన ముప్పుగా మారిన ప్లాస్టిక్ వాడకం అండ్ దాని వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్ చుట్టూ ఈ కథ నడుస్తూనే.. దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ తో సాగుతుంది.
నటన విషయానికి వస్తే కార్తీ తండ్రి, కొడుకులుగా డబుల్ రోల్‌లో జీవించేశారు. విలన్‌గా ఎస్‌జే సూర్య పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందట. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ల గ్లామర్ అండ్ యాక్షన్ ఓ రేంజ్ లో అలరిస్తాయని తెలుస్తోంది. అలాగే సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ కానుంది. సెన్సార్ నుంచి పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ 10న థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.
[Sardar 2 Review, Karthi Sardar 2, SJ Suryah Sardar 2, Sardar 2 Story, Sardar 2 Censor, PS Mithran, Telugu Cinema Review, Telugu Film News, Telugu News]






