ప్రభాస్ పండుగని ఫస్ట్ టైం మేమే జరిపించబోతున్నాం
Nov 25, 2024 10:49AM

మంచు విష్ణు(manchu vishnu)టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప(kannappa).పరమేశ్వరుడుకి, పరమ ప్రీతికరమైన భక్తుడైన భక్తకన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)గెస్ట్ రోల్ లో కథకి ఒక కీలకమైన క్యారక్టర్ ని పోషిస్తుండగా,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)శరత్ కుమార్(sarathkumar)మధుబాల,ప్రీతీ ముకుందన్(preeti mukundan)వంటి వారు ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు.
ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ ని చిత్రబృందం వెల్లడి చేసింది.వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నాం.పరమేశ్వరుడి గొప్ప భక్తుడి కథని తెలుసుకునేందుకు రెడీగా ఉండండంటూ అధికారికంగా ప్రకటించింది.దీంతో ఏప్రిల్ నెల ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగ నెలగా మారబోతుంది. ఎందుకంటే ఏప్రిల్ పదిన ప్రభాస్ వన్ మాన్ షో రాజాసాబ్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.దీంతో ఇప్పుడు ఇరవై ఐదున భక్త కన్నప్ప కూడా వస్తుండంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏప్రిల్ నెల సరికొత్త పండుగని తీసుకురానుందని చెప్పవచ్చు.కలెక్షన్స్ పరంగా కూడా ఆ రెండు చిత్రాలు వాళ్లలో జోష్ ని కూడా తీసుకురానున్నాయి.

మహాకవి దూర్జటి(dhurjati)రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప(bhaktha kannappa)చరిత్రని స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా,ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమా మీద అందరిలో ఆసక్తిని కలగ చేస్తున్నాయి. 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్(mukesh kumar singh)దర్శకుడు.



.webp)
