TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

‘కంగువ’ టీజర్‌ : ఇండియన్‌ సినిమాలో నెవర్‌ బిఫోర్‌ అనే రేంజ్‌లో విజువల్స్‌!

Mar 19, 2024 6:38PM

పోరాట యోధుడుగా సూర్య నటిస్తున్న పాన్‌ వరల్డ్‌ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌  మంగళవారం విడుదలైంది. ఈ టీజర్‌ అంతా అద్భుతాలతో నిండి ఉంది. ఒక విజువల్‌ వండర్‌గా ప్రేక్షకుల్ని సర్‌ ప్రైజ్‌ చేసింది. పులితో సూర్య చేసిన ఫైట్‌ సీక్వెన్స్‌ స్క్రీన్‌ మీదే చూడాలనిపించేలా ఉంది. హార్స్‌ ఫైటింగ్‌, బిగ్‌ షిప్‌ వార్‌ సీన్స్‌తో వరల్డ్‌ సినిమా హిస్టరీలోని ఎపిక్‌ వార్‌ మూవీస్‌ను ‘కంగువ’ టీజర్‌ గుర్తు చేసింది. హై క్వాలిటీ విజువల్స్‌ను దేవిశ్రీప్రసాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మరింత ఎలివేట్‌ చేసింది. ఉధిరన్‌తో కంగువ చేసిన రూత్‌ లెస్‌, ఫెరోషియస్‌ ఫైట్‌ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్‌, క్యారెక్టర్‌లో రిఫ్లెక్ట్‌ అయ్యింది.

‘కంగువ’ సినిమాను భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్‌ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ అనౌన్స్‌ చేయబోతున్నారు.
 

google-ad-img