కాజోల్ సలామ్ వెంకీ పాయింట్ ఇదేనా?
on Feb 4, 2023
కాజోల్ కీలక పాత్రలో నటిస్తున్న ప్రాజెక్టు సలామ్ వెంకీ. ఫిబ్రవరి 10 జి ఫైవ్ లో విడుదల కానుంది. సలామ్ వెంకీలో పవర్ ప్యాకెడ్ పెర్ఫామెన్స్ చూపించారు కాజోల్. నిజజీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్న ఓ చిన్న పిల్లాడి తల్లిగా నటించారు కాజోల్. ఆహా నాకుమ్రా, రాహుల్ బోస్, రాజీవ్ ఖండేవాల్, ప్రకాష్ రాజ్, అనంత్ మహదేవన్, ప్రియమణి ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు.
సలామ్ వెంకీలో చెస్ క్రీడ నేపథ్యంలో కీలక సన్నివేశాలను రాసుకున్నారు మేకర్స్. వెంకీ అనే అబ్బాయి చెస్ ఆడటం లో ఎదుర్కొన్న ఇబ్బందులు, అతనికి ఉన్న రేర్ డిసీజ్, దానితో అతని పోరాడిన తీరు వీటన్నిటినీ గురించి అద్భుతంగా చూపించారు మేకర్స్. ఈ సినిమాలో తల్లి సుజాత పాత్రలో నటిస్తున్నారు కాజోల్. డాక్టర్ గా రాజీవ్ ఖండేవాల్ కనిపిస్తారు. లాయర్ గా రాహుల్ బోస్, జర్నలిస్టు పాత్రలో అహనా కుమ్ర కీలకపాత్రలో కనిపిస్తారు.
సరికొత్త కథలను చెప్పడానికి ఎప్పుడూ ముందుండే కాజోల్ ఈ కథను ఎంపిక చేసుకోవడం పట్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సలామ్ వెంకీ మేకర్స్. లైట్ హార్టెడ్ డ్రామాస్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, మిస్టరీస్ కి ఆదరణ ఉన్న ఈ రోజుల్లో సలామ్ వెంకీ లాంటి ప్రాజెక్టును ఆమె ఎంపిక చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కాజల్ మాట్లాడుతూ సలామ్ వెంకీకి పనిచేయడం చాలా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఇద్దరు పిల్లలకు తల్లిగా తను సుజాత పాత్రలో ఎంతో ఇన్వాల్వ్ అయి చేశానని చెప్పారు. జీవితం అనేది ఎవరికి వడ్డించిన విస్తరి కాదని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అందుకోసం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనో, గతాన్ని గురించి బాధపడుతూనో.. ఈ క్షణాలను వృథా చేసుకోవద్దని అన్నారు కాజోల్. ఇలాంటి సినిమా కోసం తనని ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. నిర్మాత సూరజ్ మాట్లాడుతూ సలామ్ వెంకీ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుందన్నారు. ఇందులో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందని, ఆ మ్యాజిక్ ఏంటన్నది తెరపై చూసి తెలుసుకోవాలని తెలిపారు.
Also Read