Home

»

Latest News

కాజల్ మిస్సింగ్: ఆ సీన్స్ తీసేశారా.. అందుకే ‘రామాయణ’ ప్రమోషన్లకు దూరమా.?

Oct 23, 2026 4:23PM

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో ఆమె కనిపించకపోవడం చర్చకు దారితీసింది. అసలు కాజల్ ఈ సినిమాలో ఉన్నారా? ఉంటే ఆమె సన్నివేశాలు తొలగించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

‘రామాయణ’లో రావణుడి భార్య మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె గతంలోనే స్వయంగా వెల్లడించారు. అయితే మొదటి భాగంలో లంకకు సంబంధించిన సన్నివేశాలు తక్కువగా ఉంటాయని, అందువల్ల తన పాత్ర నిడివి కూడా పరిమితంగానే ఉంటుందని కాజల్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. రెండో భాగంలో మండోదరి పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని కూడా తెలిపారు.

అయితే సినిమా టీజర్‌, ట్రైలర్‌లో కాజల్ కనిపించకపోవడం, ప్రమోషనల్ ఈవెంట్లలోనూ ఆమె ప్రస్తావన లేకపోవడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఫైనల్ ఎడిటింగ్‌లో ఆమె సన్నివేశాలను తొలగించి ఉంటారనే ప్రచారం వినిపిస్తోంది. 

అయితే కాజల్ గతంలో చెప్పినట్లుగా తొలి భాగంలో పాత్ర నిడివి తక్కువగా ఉండటమే ప్రమోషన్లలో కనిపించకపోవడానికి కారణమై ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ‘రామాయణ’ తొలి భాగం దీపావళి సందర్భంగా విడుదల కానుంది. భారీ విజువల్స్, ప్రముఖ నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ పాత్ర ఎంతసేపు కనిపిస్తుంది? ఆమె సన్నివేశాలు సినిమాలో ఉంటాయా? అనే ప్రశ్నలకు సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఎవరీ వైకోమ్ విజయలక్ష్మి.. చూపు లేకపోయినా గాత్రంతో జాతీయ అవార్డు.!

 

 

 

[Kajal Aggarwal Ramayana Role, Kajal Aggarwal As Mandodari, Kajal Aggarwal In Ramayana, Kajal Aggarwal, Ramayana Movie, Mandodari, Ranbir Kapoor, Yash Ravana, Sai Pallavi, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com