
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు ‘కాకా’ అనే పవర్ఫుల్ సబ్జెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మేకర్స్ జెట్ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు చిరంజీవి నుంచి రావాల్సిన భారీ విజువల్ వండర్ ‘విశ్వంభర’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి వస్తుందని, ఈ సినిమా కోసం ‘కాకా’ త్యాగం చేస్తుందని గతంలో పలు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఖండించి, తాము సంక్రాంతికే వస్తామని కాకా టీం స్పష్టం చేసింది. దీంతో మెగాస్టార్ సినిమాల రిలీజ్ డేట్లపై ఒక క్లారిటీ వచ్చిందని అంతా భావించారు.
కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. తాజా ప్రచారం ప్రకారం.. ‘కాకా’ను సంక్రాంతి రేసు నుంచి తప్పించి మార్చిలో విడుదల చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే, ఆ స్థానంలో ‘విశ్వంభర’ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
దీంతో మరోసారి చిరంజీవి సినిమాల విడుదల తేదీలపై చర్చ మొదలైంది. మరి ‘కాకా’ అనుకున్నట్టుగానే సంక్రాంతికి వస్తుందా? లేక ఆ ప్లేస్ లో ‘విశ్వంభర’ వస్తుందా? అన్నది తెలియాలంటే మేకర్స్ స్పందించే వరకు ఎదురుచూడాల్సిందే.
ఇది కూడా చదవండి: అర్ధరాత్రి అల్లు అర్జున్‌కు ఫోన్ చేసిన విజయ్.. పక్కనే రష్మిక కూడా.!

[Kaaka Postponement Rumors, Chiranjeevi Kaaka Movie, Kaaka Release Date, Vishwambhara Release Date, Vishwambhara Sankranthi 2027, Chiranjeevi Upcoming Movies, Sankranthi 2027 Movies, Megastar Chiranjeevi, Telugu Film News]





