ENGLISH | TELUGU  

Dragon: జోర్డాన్ కు ఎన్టీఆర్.. ఆ స్టార్ తో ఢీ అంటే ఢీ!

on Feb 8, 2026

 

జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్'(Dragon) టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్, షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. (NTR Neel)

 

'డ్రాగన్' షూటింగ్ కోసం తాజాగా ఎన్టీఆర్ జోర్డాన్ వెళ్ళాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. షార్ట్ హెయిర్, గుబురు గడ్డంతో స్లిమ్ అండ్ ఫిట్ గా ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆఫ్ స్క్రీన్ లోనే ఇలా ఉంటే.. ఆన్ స్క్రీన్ లో ఏ రేంజ్ లో ఉంటుందనే చర్చ జరుగుతోంది.

 

 

జోర్డాన్ లో దాదాపు నెల రోజుల పాటు 'డ్రాగన్' షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తారట. ముఖ్యంగా ఎన్టీఆర్, మలయాళ స్టార్ టోవినో థామస్ మధ్య అదిరిపోయే సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నట్లు వినికిడి.

 

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' నుంచి సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి. టైటిల్ ను అధికారికరంగా ప్రకటించడంతో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని, స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. కొత్త విడుదల తేదీపై కూడా అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశముంది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.