ఫోక్ బీట్స్‌తో అలరిస్తోన్న 'ధమాకా' ఫస్ట్ సింగిల్ 'జింతాక్..'
on Aug 18, 2022
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తోన్న చిత్రం 'ధమాకా'. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ ప్రకటించినప్పట్నుంచే ఇండస్ట్రీలో, సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తింది. రవితేజ, హీరోయిన్ శ్రీల జంటగా విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని ఇంకా పెంచింది. కాగా, గురువారం ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'జింతాక్' లిరికల్ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు.
భీమ్స్ సెసిరోలియో సంగీతం సమకూర్చిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. భీమ్స్, మంగ్లీ పాడిన ఈ ఫోక్ టైప్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సమకూర్చారు. మంచి ఎనర్జీతో సాగిన ఈ సాంగ్ ఇన్స్టెంట్గా ఆకట్టుకుంటోంది. రవితేజ, శ్రీలల వేసిన స్టెప్స్, వారి మధ్య కెమిస్ట్రీ అలరిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఈ సాంగ్‌ను విజువల్‌గా కూడా అందంగా కనిపించేట్లు చేస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న 'ధమాకా' మూవీకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'డబుల్ ఇంపాక్ట్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీలో జయరామ్, సచిన్ ఖెడేకెర్, తనికెళ్ల భరణి, రావు రమేశ్, చిరగ్ జానీ, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్రా లోకేశ్, తులసి, రాజశ్రీ నాయర్ కీలక పాత్రధారులు.
ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సమకూర్చగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రామ్-లక్ష్మణ్, వెంకట్ ఫైట్స్ అందించారు.
Also Read