TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఉగాది రోజున లాంఛ‌నంగా ప్రారంభ‌మైన జ‌గ్గారెడ్డి సినిమా ఆఫీస్..ఇది నా అడ్డా 

Mar 31, 2025 4:38PM

మాస్ లీడ‌ర్,జ‌న‌నేత,సంగారెడ్డి(sangareddy)కాంగ్రెస్ పార్టీ మాజీ ఏంఎల్ఏ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 'జ‌గ్గారెడ్డి'(Jaggareddy)సినీరంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే.'జగ్గారెడ్డి' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుండగా ఆయ‌న కుమార్తె జ‌య‌ల‌క్ష్మీరెడ్డి ,కుమారుడు భ‌ర‌త్ సాయిరెడ్డి  నిర్మిస్తుండగా వడ్డీ రామానుజం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.నిన్న ఉగాది రోజున మూవీ ఆఫీస్ లాంఛ‌నంగా ప్రారంభం కావడంతో పాటు గ్లింప్స్ ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది.మోస్ట్ ప‌వ‌ర్ ప్యాక‌డ్ మాస్ లీడ‌ర్ గా జగ్గారెడ్డి కనిపించడంతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుస్తుంది.
  .

ఇక మూవీ ఆఫీస్ లో జ‌రిగిన పూజ‌లో జ‌గ్గారెడ్డి పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతు ద‌ర్శ‌కుడు రామానుజం చూపించిన జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్ట‌ర్ కి మొద‌ట ఆక‌ర్షితుడున‌య్యాను.ఆత‌ర్వాత ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చింది.ఇందులో ఎవ‌రో రాసిన మాట‌లు,పాత్రగా నేను ఉండ‌ను.నా క్యారక్టర్ నాదే.అంతా ఒరిజిన‌ల్,మీకు తెలిసిన జగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు.విద్యార్థి నాయ‌కుడిగా మొద‌లైన నా ప్ర‌యాణం రాష్ట్ర నాయ‌కుడి వ‌ర‌కు  రావడానికి చాలా మలుపులు ఉన్నాయి.కుట్ర‌లు, కుతంత్రాలు,హత్యా ప్ర‌య‌త్నాలు దాటుకోని ఇంత‌వ‌ర‌కూ చేరిన నా ప్ర‌యాణం ఈ క‌థ‌లో క‌న‌ప‌డుతుంది.సినిమా ఇండ‌స్ట్రీలో కూడా నాప్ర‌యాణం మొద‌లైంది.దీనికి అడ్డాగా నా సినిమా ఆఫీస్ ఉంటుంది.ఇది జ‌గ్గారెడ్డి అడ్డా అనుకోండని చెప్పడం జరిగింది.


ద‌ర్శ‌కుడు రామానుజం(Ramanujam)మాట్లాడుతు నాకు అవ‌కాశం ఇచ్చిన జ‌గ్గారెడ్డి గారికి మంచి సినిమా ఇచ్చి రుణం తీర్చుకుంటాను.జ‌గ్గారెడ్డి గారు ఎంత మాస్ లీడ‌రో అంద‌రికీ తెలుసు.సంగారెడ్డి వెళ్లి జ‌గ్గారెడ్డి గారి గురించి తెలుసుకున్నాను.మూవీలో జ‌గ్గారెడ్డి గారి క్యారక్టర్ తో పాటు మంచి ప్రేమ‌క‌థ‌కూడా ఉంటుంది.అద్దంలా ఆయన క్యారక్టర్  ఉంటుంది.కానీ దాన్ని ప‌గుల కొడితే ఒక ఆయుధం అవుతుంది.ఇదే ఈ మూవీలోని ఆయన పాత్ర.ఆయ‌న జీవితంలో జరిగిన ముఖ్య సంఘ‌ట‌న‌లు ఈ సినిమాలో క‌నిపిస్తాయి.త్వ‌ర‌లోనే మూవీ ప్రారంభ‌మ‌వుతుంది.ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయని చెప్పాడు. 

నిర్మాత జ‌య‌ల‌క్ష్మీ రెడ్డి మాట్లాడుతు మా నాన్న‌గారి జీవితంలో కొన్ని సంఘ‌ట‌న‌లు విన్నాను. వాటిని తెర‌మీద చూడ‌బోతున్నామనే ఆలోచ‌నే న‌న్ను ఎగ్జైట్ చేస్తుంది. అందరికీ నచ్చే విధంగా మూవీ ఉంటుంది.త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాలు, టెక్నీషయన్స్ గురించి చెప్తామని తెలిపారు.

 

 

 

google-ad-img