Home

»

Latest News

ఆ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ 

Aug 25, 2026 11:52AM

 

-100 కోట్లతో దూసుకుపోతున్న ఇరుముడికి షాక్ 
-తమని అగౌరవపరిచేలా ఉన్న సీన్స్ తొలిగించాలని టీచర్స్ డిమాండ్ 
-అభిమానుల్లో టెన్షన్

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఐదు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో  అభిమానులతో పాటు చిత్ర యూనిట్ లో జోష్ నెలకొని ఉండగా ఇప్పుడు ఇరుముడిని ఊహించని విధంగా ఒక పెద్ద వివాదం చుట్టుముట్టింది.

ఈ చిత్రంలో ఉపాధ్యాయుల ప్రతిష్టను, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను దిగజార్చేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఆ సన్నివేశాలను వెంటనే  తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు  డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పేరుని  స్పష్టంగా ఉపయోగించడం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ధరించే అధికారిక యూనిఫామ్‌నే సినిమాలో చూపిస్తూ ఉపాధ్యాయురాలి క్యారక్టర్ ని  నెగెటివ్ కోణంలో చిత్రీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి.

Also Read: అయ్యప్ప గెటప్‌లో డేవిడ్ వార్నర్.. ఇరుముడి ఫీవర్

 సినిమా అనేది సమాజాన్ని ప్రజల ఆలోచనలని, అమితంగా ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన మాధ్యమనేది నిజం. ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వంటి సున్నితమైన అంశాలను తెరపై చూపించేటప్పుడు దర్శకనిర్మాతలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని APTF నేతలు సైతం స్పష్టం చేశారు. మరి చిత్ర యూనిట్ ఈ విషయంపై ఈ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Irumudi, Teachers, Raviteja, Shiva Nirvana
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com