ఇలియానా.. బరువు పెరిగిందిలా!
on Feb 5, 2022

ఇలియానా అంటే నాజూకు సుందరి అని మనందరమూ భావిస్తుంటాం. 'దేవదాసు' సినిమా ద్వారా తెరంగేట్రం చేసి, ఫస్ట్ ఫిల్మ్‌తోటే కుర్రకారు కలల రాణి అయిపోయింది ఈ గోవా బ్యూటీ. పోకిరి, జల్సా, కిక్, జులాయి సినిమాలతో ఆమె పాపులారిటీ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఆమె బ్యూటికి దాసోహం కానివాళ్లు అరుదు. తమ సరసన ఇలియానా కావాలని అప్పట్లో ప్రతి స్టార్ హీరో ఆశించాడు. కానీ ఇలియానా దృష్టి బాలీవుడ్ మీద మళ్లడంతో టాలీవుడ్‌లో ఆమె పాపులారిటీ క్రమేణా తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ దేశంలోని అందమైన తారల్లో ఒకరిగా ఆమె గుర్తింపు ఏమీ మారలేదు. Also read: సంపాదించిందంతా ఒక్క సినిమాతో పోయింది!
బాలీవుడ్‌లో ఆశించిన రీతిలో ఆఫర్లు రాకపోవడంతో, తిరిగి టాలీవుడ్‌కు రావాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే ఇక్కడ కొత్త కొత్త తారలు వచ్చేశారు. అందువల్ల అప్పుడప్పుడు మాత్రమే ఇలియానా సినిమాల్లో కనిపిస్తోంది. కానీ, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ, తన బోల్డ్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను ఎప్పటికప్పుడు హీటెక్కిస్తూ వస్తోందామె. ఆమె బికినీ పిక్చర్స్‌కు ఉన్న గిరాకీ మామూలుది కాదు. Also read: తండ్రి మాటలకు స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్న హీరో!
లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. అందులో రెడ్ బికినీలో తన వంపుసొంపుల్ని ప్రదర్శిస్తూ పోజిచ్చింది ఇలియానా. కిటికీ దగ్గర నిల్చొని సముద్రంవైపు చూస్తోంది. అయితే అందర్నీ ఆకర్షించింది లావుగా కనిపిస్తోన్న ఆమె కాళ్లు. ఏడాది క్రితంతో పోలిస్తే ఆమె బాగా బరువు పెరిగినట్లు తెలిసిపోతోంది. పని తగ్గడం వల్లే ఆమె బరువు పెరిగివుండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొంతమంది దీన్ని బాడీ పాజిటివిటీ కింద తీసుకుంటున్నా, ఆమె ఆరాధకుల్లో ఎక్కువ మంది మాత్రం తమ కలలరాణి బరువు పెరిగిందని తెగ బాధపడిపోతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



