లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
on Feb 6, 2022

లెజెండరీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
జనవరి 8న లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అప్పటి నుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఈ ఉదయం కన్నుమూశారు. గతంలో ఆమె శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యకు ఎదుర్కొన్నారు. వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ దాదాపు నెల రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చివరకు ఓడిపోయారు.
లతా మంగేష్కర్ మరణ వార్త తెలిసి సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు సామాన్యులు, సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



