తండ్రి మాటలకు స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్న హీరో!
on Feb 5, 2022

రానా దగ్గుబాటి టైటిల్ రోల్ పోషించిన 'అరణ్య' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తమిళ నటుడు విష్ణు విశాల్. అతను లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ 'ఎఫ్ఐఆర్' ఫిబ్రవరి 11న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానున్నది. తెలుగు వెర్షన్‌కు మాస్ మహారాజా రవితేజ సమర్పిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం. నిన్న విడుదలైన ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచింది. కాగా, చెన్నైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై అతను కన్నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
'రాచ్చసన్' (తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన 'రాక్షసుడు'కు ఒరిజినల్) సినిమాతో వచ్చిన పాపులారిటీతో నటునిగా తనపై బాధ్యత పెరిగిందనీ, దానికి తగ్గట్లుగా మంచి సబ్జెక్టులు ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాననీ తన స్పీచ్‌లో చెప్పాడు విశాల్. ఈ సందర్భంగా 'ఎఫ్ఐఆర్' విషయంలో తనకు సాయపడిన తండ్రి దగ్గర్నుంచీ ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరకూ అందరికీ థాంక్స్ చెప్పాడు. స్పీచ్ ముగింపులో అతను చాలా ఎమోషనల్ అయ్యాడు. Also read: ప్రభుదేవా తండ్రి నటి సుధని అవమానించారా?
ఇక తన తండ్రి మాట్లాడే సమయంలో భావోద్వేగం ఆపుకోలేక కుర్చీలో కూర్చున్న విష్ణువిశాల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని తండ్రి రమేశ్ ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన ఈవెంట్‌లో మాట్లాడుతూ, తన కొడుకును చూస్తుంటే గర్వంగా ఉందనీ, అతను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన వారందరికీ థాంక్స్ చెబుతున్నాననీ అనడంతో ఉద్వేగం ఆపుకోలేకపోయిన విష్ణువిశాల్ కన్నీరు పెట్టుకున్నాడు. Also read: సినిమాలకు గుడ్ బై.. రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం!
'ఎఫ్ఐఆర్' మూవీని తన సొంత బ్యానర్ విష్ణువిశాల్ స్టూడియోజ్‌పై మను ఆనంద్ డైరెక్షన్‌లో నిర్మించాడు. ఈ మూవీలో విష్ణు విశాల్, రైజా విల్సన్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, గౌతమ్ మీనన్, గౌరవ్ నారాయణన్ ప్రధాన పాత్రలు పోషించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



