వేసవిలో మల్టిస్టారర్స్ హవా!
on Feb 5, 2022

2022 వేసవి తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో ప్రత్యేకం కానుంది. రీసెంట్ టైమ్స్ లో ఎన్నడూ లేని విధంగా.. పలు మల్టిస్టారర్స్ ఈ సీజన్ లోనే థియేటర్స్ లో సందడి చేయనుండడం ఇందుకు కారణమని చెప్పాలి.
ఆ మల్టిస్టారర్స్ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. ఫిక్షనల్ డ్రామాగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ సమ్మర్ స్పెషల్ గా మార్చి 25న తెరపైకి రాబోతోంది. ఇక వారం తరువాత అంటే ఏప్రిల్ 1న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో తయారవుతున్న `భీమ్లా నాయక్` ఎంటర్టైన్ చేయనుంది. ఫిబ్రవరి 25న రిలీజ్ కాని పక్షంలోనే ఈ సినిమా ఏప్రిల్ 1కి వస్తుంది.
Also Read: తండ్రి మాటలకు స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్న హీరో!
ఇక ఏప్రిల్ 28న విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న `ఎఫ్ 3` రాబోతోంది. 2019 నాటి `ఎఫ్ 2`కి ఇది సీక్వెల్. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మల్టిస్టారర్ `ఆచార్య` కూడా వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. మరి.. వేసవిలో హవా చాటనున్న ఈ మల్టిస్టారర్స్ లో వేటికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



