Home

»

Latest News

ఎఫైర్స్‌ మీద ఎందుకంత ఇంట్రెస్ట్‌?

Jul 01, 2020

గోవా సుందరి ఇలియానా ఎప్పుడూ లవ్‌ మేటర్స్‌ గురించి ఓపెన్‌గా చెప్పింది లేదు. ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడూ అతడితో లవ్‌లో ఉన్నానని పబ్లిగ్గా ఒప్పుకోలేదు. జస్ట్‌, నా లైఫ్‌లో ఒకరున్నారని చెప్పేది. కాకపోతే ఆండ్రూ తీసిన హాట్‌ ఫొటోలను, ఆండ్రూతో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేది.

ఆండ్రూతో బ్రేకప్‌ తరవాత అతడి ఫొటోలను తన అకౌంట్స్‌లోంచి డిలీట్‌ చేసింది. బ్రేకప్‌ గురించి ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్‌ ఇచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్‌తో బాధ నుంచి బయటకొచ్చానని చెప్పింది. ఆండ్రూ ఛాప్టర్‌ క్లోజ్‌ అయిన తర్వాత ఇప్పటివరకూ ఇలియానా ఇంకొకరితో లవ్‌లో పడిందా? లేదా? సస్పెన్స్‌గా మిగిలింది.

రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాట్‌ చేసినప్పుడు ‘ఆర్‌ యూ సింగిల్‌?’ అని ఒకరు అడిగారు. ‘‘ఇతరుల ఎఫైర్స్‌, వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తాం’’ అని ఇలియానా చెప్పింది. లవ్‌లో పడిందో, లేదో చెప్పలేదు.

లాక్‌డౌన్‌లో వర్కవుట్స్‌ చేయడంతో పాటు ఇంటి పనులు, వంట పనులు చేస్తున్నానని ఇలియానా పేర్కొంది. ‘‘ప్రస్తుతం ఆన్‌లైన్‌ వర్కవుట్‌ క్లాస్‌కి అటెండ్‌ అవుతున్నా. ఓ రోజు గంట చేస్తే, మరో రోజు 45 నిమిషాలు, కొన్ని రోజలు అరగంట, కొన్ని రోజులు ఏమీ చేయకుండా ముగిస్తా’’ అని చెప్పింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com