Home

»

Latest News

మీసం తిప్పితే రికార్డులే! బెస్ట్ 'మీసకట్టు' ఏ హీరో సొంతం?

Oct 14, 2026 1:17PM


ఒకప్పుడు తెలుగు సినిమాలో హీరో మీసం మెలేస్తే థియేటర్లు దద్దరిల్లిపోయేవి.హీరో మీసం చూస్తేనే అతని క్యారెక్టర్ ఏంటో అర్థమైపోయేది. మీసం హీరో గాంభీర్యానికి, ధైర్యానికి, పౌరుషానికి ఒక గుర్తు! కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొందరు హీరోలు మీసంతో మాస్ లుక్‌లో కనిపిస్తుంటే, మరికొందరు గడ్డం, మీసం కలిపిన స్టైలిష్ లుక్‌తో  ఆకట్టుకుంటున్నారు. అసలు అప్పటి తెలుగు హీరోల మీసకట్టుకి, ఇప్పటి హీరోల మీసకట్టుకి మధ్య ఉన్న తేడా ఏంటి? అప్పటి మీసం హీరో క్యారెక్టర్‌ని చూపిస్తే… ఇప్పటి మీసం హీరో స్టైల్‌ని  చూపిస్తోందా? మరి ఈ మీసాల వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం!

కొంచెం వెనక్కి వెళ్దాం... 70, 80, 90ల నాటి గోల్డెన్ ఎరాకి! అప్పట్లో హీరో ముఖానికి ప్రాణం అంటే ఆ మీసమే!  ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు పౌరాణిక, జానపద పాత్రల్లో కనిపించినా... ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు రొమాంటిక్, యాక్షన్ రోల్స్ చేసినా... మీసం అనేది ఒక మాస్ సింబల్. ముఖ్యంగా ఆ అందరిలో ఏఎన్ఆర్ మీసకట్టు డిఫరెంట్ .ఆ తర్వాత  చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున విభిన్నమైన మీసకట్టుతో ఫ్యాన్స్ ఐకాన్స్ గా మారారు. ఎంతో మంది ఫ్యాన్స్ వారిలా మీసకట్టుతో దర్శనమిచ్చే వారు. ఇక బాలయ్య  మీసం తిప్పి కంటిచూపుతో ప్రత్యర్థులని  భయపెడితే, థియేటర్లలో సీట్లు చిరిగిపోయేవి! అప్పట్లో మీసం లేని హీరోని ఊహించుకోవడం కూడా ఫ్యాన్స్‌కి కష్టంగా ఉండేది. మీసం ఉంటేనే హీరో, మీసం ఉంటేనే మాస్ పవర్!

అప్పటి సినిమాల్లో విలన్‌కి ఒక రకమైన మీసం, పోలీస్ అధికారికి మరో రకమైన మీసం, జమీందారుకి ఇంకో రకమైన మీసం ఉండేది. అంటే హీరో స్క్రీన్‌పై కనిపించగానే అతను ఎలాంటి వ్యక్తి అనేది ప్రేక్షకులకి ఒక అంచనా వచ్చేది. అంటే మీసం యొక్క వాల్యూని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పటి తెలుగు సినిమా విషయానికి వస్తే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అల్లు అర్జున్ పుష్ప లో పెంచిన గడ్డం, మీసం  పుష్ప క్యారక్టర్ కి ఒక ప్రత్యేకమైన మాస్ గుర్తింపుని తీసుకొచ్చాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు  తమ క్యారక్టర్ కి తగ్గట్టుగా రకరకాల మీసకట్టుతో ప్రేక్షకులని ఆకట్టుకుంటు వస్తున్నారు. ఆర్ఆర్ఆర్'లో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ మీసకట్టుతో కనిపిస్తే, తారక్ రగ్గడ్ డిఫరెంట్ స్టైల్‌లో అలరించాడు. దేవర', 'సలార్', 'పుష్ప 2' లాంటి సినిమాల్లో హీరోలు మీసాలని  కేవలం ఒక ఫ్యాషన్ లా కాకుండా, ఆ క్యారక్టర్ యొక్క నైజానికి, యాటిట్యూడ్‌కి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటున్నారు.  దీంతో ఇప్పుడు మీసం ఒక క్లాసిక్ ట్రెడిషన్ మాత్రమే కాదు... ఒక గ్లోబల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్!

అతడు" లో మహేష్ బాబు క్లీన్ షేవ్డ్ చాక్లెట్ బాయ్ లుక్‌తో వస్తే, కుర్రకారు ఫిదా అయిపోయారు. మాస్ అంటే కేవలం పెద్ద మీసం ఉండక్కర్లేదు, స్టైలిష్‌గా ఉన్నా చాలు అని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మీసం ఒక్కటే కాదు… గడ్డం, హెయిర్‌స్టైల్, బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ అన్నీ కలిపి హీరో లుక్‌ నిర్ణయిస్తున్నాయి. ఒక సినిమాలో రఫ్‌గా కనిపించే హీరో, మరో సినిమాలో నీట్‌గా షేవ్ చేసుకుని కొత్త లుక్‌లో కనిపించడం కూడా ఇప్పుడు సాధారణమే! అప్పట్లో హీరో మీసం  వ్యక్తిత్వానికి, హుందాతనానికి ప్రతీకగా కనిపించేది. ఇప్పుడేమో కథకు తగ్గట్టుగా మీసం రూపం మారుతోంది.

 

 

అప్పటి సినిమాల్లో ఒక హీరో లుక్ సంవత్సరాల పాటు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయేది. ఇప్పుడు ప్రతి సినిమాకి  కొత్త లుక్, కొత్త మేకోవర్‌తో అభిమానులని  ఆశ్చర్యపరచడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అప్పటి హీరోలు స్టైలిష్‌గా కనిపించలేదని కాదు… ఇప్పటి హీరోలకు మాత్రమే మాస్ లుక్ ఉందని కాదు. కాలానికి తగ్గట్టుగా మీసాల స్టైలింగ్, సినిమాటిక్ ప్రెజెంటేషన్ మారాయి అంతే!

 

మొత్తానికి తెలుగు సినిమాలో అప్పటి మీసకట్టు సంప్రదాయానికి, పౌరుషానికి, క్యారక్టర్ గాంభీర్యానికి ప్రతీకగా నిలిస్తే… ఇప్పటి మీసకట్టు  స్టైల్, కొత్తదనం, మాస్ ఇమేజ్‌  చూపిస్తోంది.కాలం మారినా, హీరోల లుక్స్ మారినా... మన తెలుగు సినిమాలో మీసానికి ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు, తగ్గేదేలే!

 

[History of Moustache in Telugu Cinema, Telugu Cinema Meesa kattu, Chiranjeevi, Balakrishna, Pawan kalyan, Ntr, Mahesh Babu, Prabhas, Ram Charan, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com