హీరో సూర్య కుర్రాళ్లను కొట్టాడట..!
on May 31, 2016

తమిళ నటుడు సూర్య బయట చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆయనకు కోపం చాలా తక్కువని తెలిసిన వాళ్లు చెబుతుంటారు. అయితే తాజాగా సూర్య కోపాన్ని ఇద్దరు కుర్రాళ్లు రుచి చూడాల్సి వచ్చింది. విషయంలోకి వెళ్తే, తమిళనాడు లోని అడయార్ ఏరియాలో సూర్య కార్లో వెళ్తున్నాడట. ఆ సమయానికి రోడ్డు పై గొడవ జరగడం చూసి కారు దిగి అక్కడకు వెళ్లాడు. తాగి బండి నడుపుతూ ఒక మహిళను ఢీకొట్టి, అదేంటని అడిగినందుకు అక్కడున్న వాళ్లతో గొడవ పెట్టుకుంటున్న ఇద్దరు కుర్రాళ్లు అక్కడ ఉన్నారు. వాళ్లకు నచ్చచెప్పాలని చూ సిన సూర్య, వాళ్లు వినకపోగా తనపై డైలాగులు వేయడంతో ఒక కుర్రాడిని లాగి కొట్టాడట. ఆ తర్వాత పోలీసుల్ని పిలిచి వాళ్లకు అప్పగించాడట. ఇప్పుడు తమిళనాట ఇదే సెన్సేషనల్ గా మారింది. అయితే సూర్య మ్యానేజర్ మాత్రం, సూర్య ఎవరినీ కొట్టలేదని, కేవలం వార్నింగ్ ఇచ్చి పోలీసులకు అప్పగించి వెళ్లిపోయాడని చెబుతున్నాడు. రోడ్డు పై ఏదైనా జరుగుతుంటే మనకెందుకులే అనుకుని వెళ్లిపోయే మనస్తత్వం కాదు సూర్యది. చిత్తూరు లో 24 షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ యాక్సిడెంట్ అయి పడి ఉన్న మహిళను హాస్పిటల్లో చేర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తప్పు చేసిన వాళ్లను నిలదీసి, నిజజీవితంలో కూడా సూర్య హీరో అనిపించుకున్నాడంటూ అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



