Home

»

Latest News

సింగం-3 మళ్లీ వాయిదా..ఈ కారణాల వల్లే..!

Dec 16, 2016 9:59AM

పవర్‌ఫుల్ యాక్టింగ్ కేరాఫ్ అడ్రస్ సూర్య..ఆయన హీరోగా హరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సింగం సీరిస్‌లో భాగంగా సింగం-3 పేరుతో మూడో భాగం రెడీ అయ్యింది. తొలి రెండు పార్ట్‌లకు మించిన భారీ బడ్జెట్‌తో మరింత పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సింగం-3ని తొలుత డిసెంబర్ 16న రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాతలు..కానీ రెండు పెద్ద సినిమాల మధ్య గ్యాప్ ఉండాలన్న "ధృవ" నిర్మాత రిక్వెస్ట్‌తో రిలీజ్ డేట్‌ని డిసెంబర్ 23కు వాయిదా వేసుకున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం 23వ తేదీ కూడా సింగం విడుదల ఉండదనే టాక్ వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో పాటు రీసెంట్‌గా వచ్చిన వార్థా తుఫాను తమిళనాడు ప్రజలను బాగా దెబ్బతీసింది. భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది..ఇక సినిమా వాయిదాకు మరో కారణం ఏమిటంటే సెన్సార్ బోర్డ్ సింగం-3కి "A" సర్టిఫికేట్ ఇవ్వటం..తమిళనాట "U" సర్టిఫికేట్ వచ్చిన సినిమాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో మరోసారి రివ్యూ కమిటీకి వెళ్లి "U" సర్టిఫికేట్ తెచ్చుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ కారణాలన్నీ కలిసి సినిమా విడుదలను వాయిదా వేసేలా చేశాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com