సైమా అవార్డ్స్ లో తేడా జరిగిందా...?
on May 31, 2016

అల్లు అర్జున్ టైం బాగున్నట్టు లేదు. సరైనోడు హిట్టైన తర్వాత బన్నీకి ఏదో రకంగా కాంట్రవర్సీలు తగులుకుంటున్నాయి. విషయంలోకి వెళ్తే, సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటుడి క్యాటగరీలో మహేష్ బాబు, ప్రభాస్ లతో పాటు రుద్రమదేవి సినిమాతో అల్లు అర్జున్ కూడా నామినేట్ అయ్యాడు. అయితే సైమా కోసం వెబ్ సైట్లో ఓటింగ్ పెడుతుంటారు. మొన్నటి వరకూ మహేష్, ప్రభాస్ లకు చెరో 40 శాతం ఓట్లు వస్తే, బన్నీకి 11 శాతం ఓట్లు ఉన్నాయట. అయితే రాత్రికి రాత్రి బన్నీ ఎకౌంట్ లో 30 వేల ఓట్లు వచ్చేశాయట. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఏదో గడబిడ చేశారంటూ ప్రచారం మొదలైపోయింది. సైట్ లో బగ్ కారణంగా ఇలా జరిగిందా..లేక ఎవరైనా కావాలనే ఇలా చేశారా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అవి ఫేక్ ఓట్లు అని భావించిన సైమా, వాటన్నింటినీ తొలగించిందనే టాక్ కూడా ఉంది. అసలు ఒక్క రాత్రిలో అన్ని ఓట్లు రావడమేంటి..వచ్చిన వాటిని సైమా రద్దు చేయడమేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇది బన్నీ మీద ప్రేమతో ఆయన గెలవాలని ఫ్యాన్స్ చేసిన పనా..లేక బ్యాడ్ నేమ్ తీసుకురావాలని యాంటీ ఫ్యాన్స్ చేసిన పనా..? కొన్ని రోజులు ఆగితే దీనికి సమాధానం దొరికే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



