వామ్మో...సింగం 3 కి తీసుకుంది 1 % ఫుటేజేనా
on Feb 7, 2017
రీల్స్ వాడిన రోజుల్లో, దర్శకులకి రోజుకి ఇంత పరిధి అని ఉండేది. కానీ, డిజిటల్ వచ్చాక, ఆ పరిధికి అవధులు లేకుండా పోయింది. కొందరు అయితే ఏకంగా, మూడు నాలుగు సినిమాలకి వాడే ఫుటేజ్ ఒకే సినిమాకి వాడుతున్నారు. అసలు వెస్టేజ్ అన్నది పెద్ద విషయం కాదు కాబట్టి నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, ఈ విషయం వింటే మీరు ఖచ్చితంగా విస్మయం చెందుతారు.
హీరో సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్లో వస్తున్న సింగం 3 ఈ నెల 9 న విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా ను ప్రమోట్ చేస్తూ బిజీ గా ఉన్న హరి, ఒక ఆశ్చర్యకర విషయం చెప్పాడు. అదేంటంటే, ఈ సినిమా మొత్తం ఫుటేజీ 17 లక్షల రీల్స్ నిడివి వచ్చింది. కానీ, వాళ్ళు వాడుకుంది కేవలం 14000 లు మాత్రమే. అంటే 1 % కన్నా కూడా తక్కువే. 'మిగతా 99.2 % ఫుటేజ్ ని సింగం 4 మరియు 5 కి వాడతాం,' అని ఇంకా కనీసం రెండు పార్ట్ లు ఉంటాయి అని చెప్పకనే చెప్పాడు. కానీ, లెక్క ప్రకారం చూస్తే ఆ ఫుటేజ్ వాడుకుంటే లెక్కలేనన్ని సినిమాలకి వాడొచ్చేమో!