Home

»

Latest News

ఉస్తాద్ షూటింగ్ లొకేషన్ లో డాగ్ స్క్వాడ్, సెక్యూరిటీ చెకప్ ఉండేది

Mar 08, 2026

ఆట షో ఈ వారం అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ షోకి డైరెక్టర్ హరీష్ శంకర్ వచ్చారు. "డిప్యూటీ సీఎం గారితో డాన్స్ వేయించాలని ఎలా అనిపించింది. దేఖ్లేంగే సాంగ్ చూసేసరికి మా మైండ్ బ్లాంక్ ఐపోయింది " అన్నాడు సుధీర్. "డిప్యూటీ సీఎం అనే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టే ఐటెం సాంగ్ లా కాకుండా నీట్ గా బ్లేజర్ వేసి డిగ్నిఫైడ్ గా డాన్స్ చేయించాం." అని తెలిపారు హరీష్. (Ustaad Bhagat Singh)

"గబ్బర్ సింగ్ టైములో పవర్ స్టార్ తో పని చేశారు, ఉస్తాద్ మూవీకి వర్క్ చేశారు. సెట్ లోకి వచ్చాక ఏమన్నా డిఫరెన్స్ ఉందా ? " అని అడిగాడు. "ఆయన రాగానే కాస్ట్యూమ్ తీసుకెళ్తాం. వెంటనే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి మెటల్ డిటెక్టర్ తో కాస్ట్యూమ్ ని చెక్ చేయడం. పొద్దున్నే డాగ్ స్క్వాడ్ వచ్చి లొకేషన్ అంతా చెక్ చేయడం అన్ని కొత్తగా అనిపించాయి. కానీ ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. మార్చ్ 19 న మూవీ రిలీజ్ అవుతోంది. అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రండి." అన్నాడు హరీష్ శంకర్. 

ఇక ఉస్తాద్ మూవీలో డైలాగ్ ని సుధీర్ ఒక రేంజ్ లో చెప్పాడు."గుర్తు పెట్టుకో గాజంటే సైజు కాదు సైన్యం " అని చెప్పాడు. ఎలా రాస్తారు సర్ ఇలా అని నిహారిక అడిగింది. "పవర్ స్టార్ గారు ఇలానే అడిగారు నన్ను. మీరు అలా కూర్చుంటే ఇలాగే రాస్తాం అని చెప్పా" అన్నాడు హరీష్ శంకర్. 

"మాకెవ్వరికీ తెలీని బెస్ట్ మెమరీ చెప్పండి" అని అడిగాడు. "ఒక సీన్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి దణ్ణం పెట్టగానే ఈయన కూడా వంగి దణ్ణం పెట్టేసారు. సర్ మీరు ఇంకా డిప్యూటీ సీఎం అనుకుంటున్నారు ఇక్కడ మీరు హీరో సర్ అన్నా. ఆయన నవ్వుకుని అలవాటైపోయిందయ్యా నాకు ఎవరైనా దణ్ణం పెట్టగానే నేను కూడా దణ్ణం పెట్టేస్తున్నాను అన్నారు. అలా కాదు సర్ మీరు హీరో ఇక్కడ డైలాగ్ ఉంది అన్నా. మొన్న అదే గుర్తు చేస్తే ఆయన నవ్వుకుంటున్నారు. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు కేవలం ఆట షోకి మాత్రమే ఎక్సక్లూసివ్ " అన్నాడు హరీష్ శంకర్.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com