TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నందమూరి తారకరామారావు సరసన చేరిన పవన్ కళ్యాణ్.. యాభై శాతం అయిపోయింది 

Jun 17, 2024 3:07PM

సినిమా అనేది  ఎంత శక్తీ వంతమైనదో  పవన్ కళ్యాణ్ (pawan kalyan)ద్వారా మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వడానికి, మంత్రి అవ్వడానికి సినిమానే కారణం. పవన్ కి కూడా ఈ విషయం తెలుసు. అంత కంటే ముఖ్యంగా కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేసింది సినిమానే. లేటెస్ట్ గా పవన్ కి  సంబంధించిన న్యూస్ ఒకటి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని తెస్తుంది.


హరిహర వీరమల్లు (hari hara veeramallu)చాలా ఏళ్ళ క్రితమే షూటింగ్ స్టార్ అయ్యింది. కానీ అనుకొని కారణాల వాళ్ళ పోస్ట్ ఫోన్  అవుతు వచ్చింది.  వీరమల్లు తర్వాత ప్రారంభమయిన  ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లు వీరమల్లు తో పోల్చుకుంటే కొంచం స్పీడ్ గానే  షూటింగ్ ని జరుపుకున్నాయి. పైగా వీరమల్లు గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందనే పుకార్లు వ్యాపించాయి. దీంతో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం రంగంలోకి దిగి మూవీ ఆల్రెడీ యాభై శాతం అయిపోయిందని చెప్పాడు. పైగా చిన్నపాటి టీజర్ కూడా రిలీజ్ చేసాడు. టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులులేకుండా పోయాయి. ఇప్పుడు ఇంకో న్యూస్ వాళ్ల ఆనందానికి రెస్ట్ లేకుండా చేస్తుంది. జూన్ చివరి వారం నుంచి లేదా జులై మొదటి వారం నుంచి పవన్ వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ కి  సమాచారం ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.

 పవన్  ఎన్నికల్లో గెలిచి కొన్ని రోజులు కూడా కాలేదు. పైగా మినిస్టర్ అండ్  డిప్యూటీ మినిస్టర్ గా ఇంకా  కుదురుకోలేదు. అలాంటిది  సినిమాకి పవన్  ప్రాధాన్యత ఇస్తున్నాడు.  తన వల్ల ప్రొడ్యూసర్ నష్టపోకూడదనే  పవన్ తాపత్రయానికి ఫ్యాన్స్  హాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అదే విధంగా  ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకి కూడా కొంచం లేటుగా అయినా కూడా  డేట్స్ కేటాయిస్తాడనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఏది ఏమైనా  సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి  కీలక  పదవిలో  ఉండగానే మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడం చూస్తుంటే అందరకి పెద్దాయన ఎన్టీఆర్ (ntr)గుర్తుకొస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉండగానే  శ్రీనాధ కవి సార్వభౌముడు షూటింగ్ లో ఆయన పాల్గొనడం జరిగింది. 

google-ad-img