Home

»

Latest News

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'వీరమల్లు' బరిలోకి దిగుతున్నాడు!

Jul 26, 2022 11:07AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్ ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. అందుకే ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అంచనాలను మరింత పెంచేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ రావడం, సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ లేకపోవడం ఫ్యాన్స్ కి కాస్త నిరాశ కలిగిస్తోంది. అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే వీరమల్లు మళ్ళీ యాక్షన్ లోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

'హరి హర వీరమల్లు' షూటింగ్ ఆగస్టు రెండో వారం నుంచి తిరిగి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి, పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలని పవన్ భావిస్తున్నారట. అందుకే అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారం కల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న టీజర్ కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com