TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

హరి హర వీరమల్లు.. అసలు ఉందా లేదా..?

Feb 17, 2025 2:14PM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'హరి హర వీరమల్లు' విడుదలపై సస్పెన్స్ నెలకొంది. మార్చి 28న సినిమా విడుదలవుతుందని మేకర్స్ చెబుతున్నప్పటికీ, నిజంగా రిలీజ్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (Hari Hara Veera Mallu)

 

'హరి హర వీరమల్లు' చిత్రాన్ని దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకటించారు. కోవిడ్ పాండమిక్, పవన్ పాలిటిక్స్ తో పాటు.. ఏవో ఇతర కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమాని 2025, మార్చి 28న విడుదల చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే మిగిలిన షూటింగ్ ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఇచ్చారు. విజయవాడ సమీపంలో వేసిన భారీ సెట్స్ లో కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా, అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు మళ్ళీ 'హరి హర వీరమల్లు' విడుదలపై సందేహాలు కలుగుతున్నాయి.

 

మార్చి 28కి ఇంకా 40 రోజుల స‌మ‌యం మాత్రమే ఉంది. ఒక కీలక సన్నివేశం చిత్రీకరణ మినహా 'హరి హర వీరమల్లు' షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. ఆ సీన్ షూటింగ్ పూర్తి చేయాలంటే పవన్ డేట్స్ కావాలి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. పైగా ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మార్చిలో పవన్ డేట్స్ ఇచ్చినా.. మార్చి 28 నాటికి అంత తక్కువ సమయంలో సినిమా రెడీ అవుతుందా అనేది అనుమానమే. మరి అన్నీ అనుకున్నట్టు కుదిరి 'హరి హర వీరమల్లు' మార్చి 28కి విడుదలవుతుందో? లేక మళ్ళీ వాయిదా పడుతుందో? చూడాలి.

 

google-ad-img