పవన్ కళ్యాణ్ కోసం హనుమాన్...
on May 7, 2024
పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు తెలుగు సినీ పరిశ్రమ నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. కొందరు పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ తరపున ప్రత్యక్షంగా ప్రచారం చేస్తుండగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలుపుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో 'హనుమాన్'తో పాన్ ఇండియా హీరోగా మారిన తేజ సజ్జ చేరాడు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా జనసేనాని కి తన మద్దతు తెలిపాడు తేజ. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తేజ ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ అంటే తేజ సజ్జకి ప్రత్యేక అభిమానం. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ.. పవన్ హీరోగా నటించిన 'బాలు' సినిమాలో తనదైన నటనతో మెప్పించాడు.
Also Read