Home

»

Latest News

హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ సునామీ: మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు!

Oct 10, 2026 11:16AM


రాముడితో కలిసిపోయిన హనుమాన్ అంశగా భావించే 'నీం కరోలి బాబా' జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం  'హనుమాన్ అంశ్'. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 428 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి' నిన్న తెలుగు సెల్యులాయిడ్ పై  తెలుగులో అడుగుపెట్టింది.


మొదటి రోజు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో  బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదయ్యాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఫస్ట్ డే సుమారు  60 లక్షల నెట్ కలెక్షన్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 703 షోలతో ప్రదర్శనను ప్రారంభించిన ఈ చిత్రం, ఏకంగా 17.91% ఓవరాల్ ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం.   ముఖ్యంగా మార్నింగ్ షోల నుంచి నైట్ షోల వరకు థియేటర్లలో ప్రేక్షకుల తాకిడి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మార్నింగ్ షోలకు 13.09% ఆక్యుపెన్సీ నమోదు కాగా, మధ్యాహ్నం మరియు సాయంత్రం ఆటలకు  16.36% మరియు 17.73%కి పెరిగింది. నైట్ షోల విషయానికి వస్తే, ఏకంగా 17.91% ఆక్యుపెన్సీని సాధించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బలమైన పునాది వేసుకుంది. 

 ఇది కూడా చదవండి :Hanuman Ansh Movie Review Telugu: హనుమాన్ అంశ్ మూవీ రివ్యూ 

 

 

విశాల్ చతుర్వేది దర్శకుడు కాగా తెలుగు మార్కెట్ లో అగ్ర నిర్మాణ సంస్థ హోంబులే ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది.

 

[Hanuman Ansh Telugu Version First Day Collections, hanuman ansh telugu collections, hanuman ansh first day box office, hanuman ansh telugu Review, telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com