Home

»

Latest News

హనుమాన్ అంశ్: తెలుగులో ఊహించని రెస్పాన్స్.!

Oct 12, 2026 4:06PM

బాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై భారీ వసూళ్లు సాధించిన ‘హనుమాన్ అంశ్’.. తెలుగు బాక్సాఫీస్ దగ్గర మాత్రం అదే స్థాయి ప్రభావం చూపలేకపోతోంది. హిందీలో రెండు నెలలకు పైగా థియేటర్లలో కొనసాగుతూ వందల కోట్ల వసూళ్లు సాధించిన ఈ భక్తి ప్రధాన చిత్రం.. తెలుగులో విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోందని ట్రేడ్ వర్గాల అంచనా.

నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు హిందీలో మంచి ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.430 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే తెలుగులో మాత్రం ఆ స్థాయి ప్రభావం కనిపించలేదు. అక్టోబర్ 9న విడుదలైన తెలుగు వెర్షన్.. తొలి మూడు రోజుల వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.2 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

సినిమాలో భావోద్వేగాలు బలంగా ఉన్నాయనే టాక్ వచ్చినప్పటికీ.. ఆ స్పందన బాక్సాఫీస్ వసూళ్లలో కనిపించలేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ఆలస్యంగా విడుదల కావడం, అలాగే ఆశించిన స్థాయిలో ప్రమోషన్లు జరగకపోవడం ప్రధాన కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, నీమ్ కరోలీ బాబా జీవిత నేపథ్యంపై తెలుగు ప్రేక్షకుల్లో విస్తృతమైన అవగాహన లేకపోవడం కూడా ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. కథలో నిజాయితీ ఉన్నప్పటికీ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్థాయిలో హైప్ క్రియేట్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. హిందీలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. తెలుగు మార్కెట్‌లో మాత్రం నిరాశపరిచింది. ఈ వారం కొత్త సినిమాలు కూడా విడుదలవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ‘హనుమాన్ అంశ్’ వసూళ్లు పుంజుకుంటాయా? లేదా? అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: AA23 ఆగిపోయిందా.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్.!

 

 

 

[Hanuman Ansh Telugu Box Office, Hanuman Ansh Telugu Collections, Hanuman Ansh Collections, Hanuman Ansh Telugu, Neem Karoli Baba, Hanuman Ansh, Telugu Film News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com