TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఈ అమ్మడి లక్కు... ఎవరికీ కిక్కు..?

Feb 5, 2014 11:36AM

 

"దేశముదురు" సినిమాతో తెలుగు సినిమా తెరకు పరిచయమైన అందాల బ్యూటీ హన్సిక ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఈ భామ నటించిన "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. "దూసుకేల్తా" తర్వాత మరోసారి ఇందులో విష్ణుకి జోడిగా నటించింది. విష్ణుకి హన్సిక లక్కీయే అని చెప్పవచ్చు. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం కొత్త జోడిలకు సిద్ధమయ్యింది.

హన్సిక ప్రస్తుతం రవితేజతో కలిసి "పవర్" చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంటుంది. అదే విధంగా నాగచైతన్య హీరోగా దర్శకుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఇందులో చైతుతో కలిసి హన్సిక రొమాన్స్ చేయనుంది. అదే విధంగా మంచు మనోజ్ హీరోగా నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతుంది. ఇందులో మనోజ్ తో కలిసి చిందులేయబోతుంది.

మరి అసలే మంచు(విష్ణు) ఫ్యామిలీకి బంగారు బాతులాగా మారిన ఈ అమ్మడు మనోజ్ కి అలాంటి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. అదే విధంగా చైతన్య, రవితేజలకు కూడా ఈ అమ్మడి ద్వారా ఎలాంటి లక్కు కలిసొస్తుందో త్వరలోనే తెలియనుంది.

google-ad-img