ప్రిన్స్ బుడ్డోడు అదరగొట్టాడంట...!
on Dec 10, 2013
మహేష్ హీరోగా నటిస్తున్న చిత్రం "1". ఈ చిత్రంలో మహేష్ తనయుడు గౌతమ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నవి. ఇందులో మహేష్, గౌతమ్ లు కలిసి డబ్బింగ్ పనుల్లో పాల్గొన్నారు. ఈ డబ్బింగ్ లో గౌతమ్ ఇరగదీసాడని, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పోటాపోటీగా ఒక ఆట ఆడేసుకున్నారట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఈనెల 19న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. 14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.