
ప్రేక్షకులని అభిమానులుగా మార్చుకున్న హీరోల్లో గోపిచంద్ ఒకరు. ఈ సారి బ్లాక్ బస్టర్ అందుకోవాలనే పట్టుదలతో 'సింగ' ని శరవేగంగా ముస్తాబు చేస్తున్నాడు. టైటిల్ చాలా వైవిధ్యంగా ఉంది కదా! మూవీ కూడా రెగ్యులర్ ఫార్మేట్ కి భిన్నంగా అంతే వైవిధ్యంగా ఉండబోతునట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా షూటింగ్, ప్రొడక్షన్ అప్‌డేట్‌కి సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఒక అద్భుతమైన వార్తను అందించింది. 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్‌లో గోపీచంద్ అత్యంత గంభీరంగా, వైల్డ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీని తారాస్థాయికి చేర్చారు. దట్టమైన అడవి నేపథ్యంలో, ఒక ప్రత్యేకమైన ఆయుధంతో గోపీచంద్ కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: హిట్ ఇచ్చే కొత్త దర్శకులు ఎందుకు రావడం లేదు: వీళ్లే కారణమా!

సినిమా ఎలాంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు భావోద్వేగాలతో ఉండబోతుందో ఈ పోస్టర్ స్పష్టంగా తెలియజేస్తోంది. గోపీచంద్ సరసన మలయాళ బ్యూటీ అనార్కలి నాజర్ హీరోయిన్‌గా చేస్తుండగా, సామ్ సి.ఎస్ మ్యూజిక్. స్టంట్స్ మాస్టర్ వెంకట్ డైరెక్టర్.70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
[Gopichand Singa Movie shooting Update, Gopichand Singa movie, V Venkat directorial debut, Gopichand 34 updates, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






