TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

'సీటీమార్‌'లో ఆంధ్ర క‌బ‌డ్డీ కోచ్ లుక్‌!

Jun 11, 2020 9:00PM

 

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది డైరెక్ట్ చేస్తోన్న మూవీ 'సీటీమార్‌'. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మించ‌బ‌డుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ సంవ‌త్స‌రంలో మొద‌ల‌యిన ఈ సినిమా లాక్‌డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌

మిగిలిన భాగాన్ని ఆగ‌స్ట్ మొద‌టివారం నుండి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయ‌డానికి చిత్ర బృందం సిద్ద‌మ‌వుతుంది. ఎంత‌గానో ఎదురు చూస్తున్న గోపీచంద్ అభిమానుల కోసం వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. జూన్ 12 ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా 'సీటీమార్' టీమ్ శుభాకాంక్ష‌లు తెలిపి న్యూ స్టిల్ విడుద‌ల చేసింది.
 
ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్ జ్వాలారెడ్డిగా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా చాలా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యంలో ఒక పాట మిన‌హా ఇప్ప‌టికే నాలుగు పాట‌లు రికార్డ్ చేయ‌డం జ‌రిగింది. మాస్ ప్రేక్ష‌కుల కోసం ఒక మాస్ ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేస్తున్నారు మ‌ణిశ‌ర్మ‌. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ ప్రేక్ష‌కుల‌కు ఐ ఫీస్ట్ లా ఉంటుందంటున్నారు.

 

google-ad-img