TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

అంజలిని భయపెడుతున్న సైతాన్

Jul 17, 2014 2:29PM


అసలే సీతమ్మ.. అందులోనూ అందాల అంజలి పాప... ఆమెను భయపెట్టడానికి ఓ సైతాన్ సిద్ధమవుతున్నాడు.
అంజలి తాజాగా నటిస్తున్న చిత్రం ‘గీతాంజలి’. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పుడు ఒక సైతాన్ రాజు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ సైతాన్ నవ్విస్తూ భయపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


కామెడీ కింగ్ కిల్ విల్ పాండే సైతాన్ రాజాగా కొత్త అవతారం ఎత్తుతున్నాడు. టాప్ హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న బ్రహ్మీ ఇప్పుడు స్క్రీన్ మీద కనపడితే చాలు అనుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. అందుకే ఈ హర్రర్ కామెడీలో ఆయనకో ప్రత్యేక పాత్ర క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.  గీతాంజలి చిత్రానికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం‌వి‌వి సత్యనారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోన వెంకట్ కథ అందిచారు.  పోస్టర్లో కనిపిస్తున్న సైతాన్ రాజాగా గెటప్ ఆ క్యారెక్టర్ ఎంత వెరైటీగా వుండబోతోందో తెలియచేస్తోంది.

google-ad-img