
గాయత్రి గుప్తా(Gayatri Gupta)ఏంటి నన్ను పట్టించుకోవడంలేదని నెట్టిల్లు కొన్ని రోజుల నుంచి డల్ గా ఉంది. ఇప్పుడు ఆ డల్ ని పోగొట్టడానికి గాయత్రి గుప్తా వచ్చేసింది. రావడం రావడమే శివాజీపై కౌంటర్ అటాక్ చేసి తనపై నమ్మకం పెట్టుకున్న నెట్టింటికి సరికొత్త జోష్ తీసుకొచ్చింది.
రీసెంట్ గా గాయత్రి గుప్తా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. కొన్ని రోజుల క్రితం నటుడు శివాజీ(SIvaji)మహిళల డ్రెస్సింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ గురించి మీ స్పందన ఏంటనే ప్రశ్న ఎదురయింది. అప్పుడు ఆమె మాట్లాడుతూ నేను ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది నా వ్యక్తిగత ఇష్టం. ఎవరో శివాజీ గారు చెప్పారు కదా అని నేను చీర కట్టుకోను. "పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు ఉంది ఆయన వ్యవహారం. చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించడం సరికాదు.
Also read: Faria Abdullah: బుర్ర పనిచేయకపోతే ఇలాగే ఉంటుంది ఫరియా.. షాక్ లో ఫ్యాన్స్
మహిళలు ఏం వేసుకోవాలో చెప్పే బదులు, పురుషులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని చెప్పాలని ఆమె హితవు పలికారు. గాయత్రి గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొందరు గాయత్రిని సమర్థిస్తూ డ్రెస్సింగ్ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం, అందులో ఇతరుల జోక్యం అనవసరం" అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం శివాజీకి మద్దతుగా నిలుస్తూ 'శివాజీ గారు ఒక పెద్దన్నలా సలహా ఇచ్చారు తప్ప, విమర్శించలేదు అని అభిప్రాయపడుతున్నారు.






