మరీ ఇంత రేటా విశ్వక్ సేన్.. రేంజ్ పెరగలేదా
on May 1, 2024
విశ్వక్ సేన్( vishwak sen)..వరుస హిట్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కంటు ఒక స్థానాన్ని సంపాదించాడు. ఎంతో మంది ప్రేక్షకులకి అభిమాన హీరో గా కూడా మారాడు.లేటెస్ట్ గా గామితో హిట్ కొట్టాడు. హిట్ కొట్టడమే కాదు తనలో పాన్ ఇండియా నటుడు ఉన్నాడని కూడా నిరూపించాడు.లేటెస్ట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari)తో రాబోతున్నాడు. రిలీజ్ కి ముందే
ఆ మూవీ ఒక రికార్డు క్రియేట్ చేసింది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ నెల 17 న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అవ్వనుంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడ ఊపందుకున్నాయి. పక్కా విలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్యూర్ మాస్ మూవీ. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఆ విషయం అందరకి అర్ధమయ్యింది.దీంతో మూవీ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఓటిటి హక్కులుని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. పద్నాలుగు కోట్ల రూపాయల రికార్డు ధరకి సదరు సంస్థ దక్కించుకుంది. విశ్వక్ మూవీ అంత పెద్ద మొత్తానికి అమ్ముడవ్వడం ఇదే మొదటి సారి. పైగా విశ్వక్ సేన్ సినీ కెరీర్ టాప్ రేంజ్ లో కొనసాగతు ఉందనడానికి ఉదాహరణగా కూడా నిలిచింది
సితార ఎంటర్ టైనేమెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో ఆ సంస్థ మంచి హిట్ కొట్టింది. డి జె టిల్లు ఫేమ్ నేహా శెట్టి విశ్వక్ తో జతకట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ఒక కీలక పాత్రలో నటించింది. నాజర్, సాయికుమార్, గోపరాజు రమణ ముఖ్య పాత్రల్లో నటించగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు
Also Read