బాలీవుడ్‌లో ఎన్నో హిట్ పాటలకు తనదైన మాస్ స్టెప్పులతో కొరియోగ్రఫీ అందించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఆయన బయోపిక్‌గా తెరకెక్కిన ‘గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక సాధారణ డ్యాన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, బాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా ఎదిగే క్రమంలో ఎదురైన కష్టాలు, అవమానాలు, త్యాగాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా సెలబ్రిటీల జీవిత కథలను ఇతర దర్శకులు తెరకెక్కిస్తుంటారు. కానీ గణేశ్ ఆచార్య మాత్రం తన జీవిత కథకు తానే రచన చేసి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన కుమార్తె సౌందర్య ఆచార్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన కెరీర్‌లో ఎదురైన సవాళ్లు, కలలను నిజం చేసుకునేందుకు చేసిన పోరాటాన్ని ఎంత సహజంగా తెరపై చూపించారన్న ఆసక్తి ట్రైలర్‌తో పెరిగింది.
ఈ చిత్రంలో గణేశ్ ఆచార్య పాత్రలో యువ నటుడు శివాంశు సోని నటిస్తున్నారు. అలోక్ షా, సుకన్య కలన్, సాక్షి పవస్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డ్యాన్స్ సన్నివేశాలతో పాటు భావోద్వేగభరితమైన ఘట్టాలు కూడా ట్రైలర్‌లో చోటుచేసుకున్నాయి. జునైద్ కుమార్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడటం, ఎన్నో త్యాగాలు చేయడం అవసరమనే అంశాన్ని ఈ సినిమా ప్రధానంగా చూపించనుంది.
‘గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్’ చిత్రాన్ని డిసెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నారు. తన జీవితంలోని అనుభవాలను గణేశ్ ఆచార్య ఏ విధంగా తెరపై ఆవిష్కరించారు? కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదుగుదల వెనుక ఉన్న పోరాటం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అన్నది సినిమా విడుదలయ్యాక తెలియనుంది.
[Ganesh Acharya Biopic, Ganesh Dust to Stardust, Ganesh Acharya Movie, Ganesh Dust to Stardust Trailer, Shivanshu Soni, Soundarya Acharya, Bollywood Choreographer, Ganesh Acharya Life Story, Ganesh Biopic Release Date, Hindi Movie News]






